ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rammurthy Naidu: ముగిసిన రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు.. కన్నీటి పర్యంతమైన కుటుంబసభ్యులు..

ABN, Publish Date - Nov 17 , 2024 | 04:20 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తన తండ్రి పార్థివదేహానికి కొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.

Last rites of Nara Rammurthy Naidu

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తన తండ్రి పార్థివదేహానికి కొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రామ్మూర్తి నాయుడి మృతదేహాన్ని ఇవాళ(ఆదివారం) ఉదయం ప్రత్యేక విమానంలో నారావారిపల్లెకు తరలించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.


అంతకుముందు రామ్మూర్తి నాయుడి అంతిమయాత్రలో తమ్ముడి పాడెను సీఎం చంద్రబాబు మోశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కన్నీటిపర్యంతం అయ్యారు. మరోవైపు ఆయన అంతిమయాత్రలో మందకృష్ణ మాదిగ డప్పు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, సినిమా పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. కాగా, రామ్మూర్తి నాయుడు మృతితో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అందరూ కలిసి రామ్మూర్తి నాయుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.


హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం రామ్మూర్తి నాయుడి పార్థీవదేహం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అదే విమానంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఇతర బంధువులు వచ్చారు. అందరూ కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే రేణిగుంట విమానాశ్రయం నుంచి చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ సైతం గ్రామానికి చేరుకున్నారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి, ఇతర కుటుంబ సభ్యులు సైతం గ్రామానికి వచ్చారు. మరోవైపు రామ్మూర్తి నాయుడు పార్థివదేహానికి పలువురు ప్రజాప్రతినిధులు, సినీ నటులు నివాళులు అర్పించారు.


చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, సినీనటులు మోహన్ బాబు, మంచు విష్ణు, రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, మహారాష్ట్ర గవర్నర్ సి.రాధాకృష్ణన్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

AP Politics: క్షుద్రపూజలు చేస్తూ దొరికిపోయిన వైసీపీ నేత..

కిమ్ మామ వింత చేష్టలు.. నిద్రలేని రాత్రులతో ప్రజలు

ప్రియురాలితో జాలీ రైడ్‌.. ఊహించని షాక్..

అయ్యో దేవుడా.. నీకు మనసెలా వచ్చిందయ్యా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 17 , 2024 | 04:36 PM