ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: ఆందోళన కలిగిస్తున్న అదృశ్యం కేసులు..

ABN, Publish Date - Dec 08 , 2024 | 09:59 AM

తిరుపతిలో తల్లిదండ్రులు మందలించారని ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. తాము రైలు ఎక్కి వెళ్లిపోతున్నట్లు ఫోన్ చేసిన విద్యార్థులు తల్లికి సమాచారం అందించారు. ఏదో విషయంలో తప్పు చేశారని రవిశంకరాచారి, పవన్, రానా అనే ముగ్గురు కుమారులను తల్లిదండ్రులు మందలించారు.

తిరుపతి: నగరంలో వరస మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. పలు కారణాలతో అదృశ్యం అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు మందలించారని, భర్తతో గొడవ, కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులు సైతం వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా ఒకే రోజు ఆరుగురు ఇంటి నుంచి అదృశ్యం కావడం ఆందోళనకు గురి చేస్తోంది.


అదృశ్యమైంది వీరే..

తిరుపతిలో తల్లిదండ్రులు మందలించారని ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. తాము రైలు ఎక్కి వెళ్లిపోతున్నట్లు ఫోన్ చేసిన విద్యార్థులు తల్లికి సమాచారం అందించారు. ఏదో విషయంలో తప్పు చేశారని రవిశంకరాచారి, పవన్, రానా అనే ముగ్గురు కుమారులను తల్లిదండ్రులు మందలించారు. తల్లిదండ్రులు తిట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాము పారిపోతున్నట్లు తల్లికి సమాచారం అందించారు. దీంతో బాధిత కుటుంబం తూర్పు పోలీసులను ఆశ్రయించింది. తమ ముగ్గురు పిల్లలు కనపడటం లేదని, వారిని రక్షించి తీసుకురావాలని ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


మరోవైపు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరసకు అక్కాచెల్లెలు అయ్యే ఇద్దరు యువతులు అదృశ్యం అయ్యారు. వారి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఓ వివాహిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. వివాహం జరిగిన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ఘర్షణ జరిగింది. దీంతో తీవ్రమనస్తాపం చెందిన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. వివాహిత మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఎన్‌హెచ్‌ఆర్సీ సమన్లు జారీ..

కాగా, ఏపీవ్యాప్తంగా గత కొన్నేళ్లలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహించింది. అదృశ్యం కేసులపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ షరతులతో కూడిన సమన్లు జారీ చేసింది. అవసరమైన నివేదికలు పంపాలని పలుమార్లు రిమైండర్లు ఇచ్చినా స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అవసరమైన సమాచారం, డాక్యుమెంట్లతో 20 జనవరి, 2024 లోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని కమిషన్‌ ఆదేశించింది. ఒక వేళ వచ్చే నెల 14వ తేదీలోగా సంబంధిత సమాచారం, డాక్యుమెంట్లు అందితే వ్యక్తిగత హాజరును రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఏపీలో 3 వేలకు పైగా బాలికలు కనిపించకుండాపోయారని ఓ ఆంగ్లవార్త పత్రికలో ప్రచురితమైన వార్తకథనం ఆధారంగా న్యాయవాది, సామాజిక కార్యకర్త వై.బాలచందర్‌రెడ్డి గత జనవరిలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన కమిషన్.. సీఎస్‌కు ఆదేశారు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: ఆ డీఎస్పీలను మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం

మా పోస్టులు రెవెన్యూ వాళ్లకా..?

Updated Date - Dec 08 , 2024 | 10:08 AM