Tirumala: నవంబర్‌లో శ్రీవారిని ఎంత మంది దర్శించుకున్నారంటే
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:18 AM
Andhrapradesh: సర్వదర్శనం భక్తులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకేన్లు జారీ చేస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.
తిరుమల, డిసెంబర్ 28: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆ దేవదేవుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. ఇక వారాంతరాలు, సెలవుల్లో అయితే శ్రీవారి భక్తులు సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుని ఆయన సేవలో తరిస్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ కానుకలు, లడ్డూల విక్రయాలు తదితర వివరాలను ఈవో శ్యామలారావు తాజాగా వెల్లడించారు. నవంబర్ నెలలో శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో తెలిపారు. అలాగే హుండీ ద్వారా రూ.111 కోట్ల ఆదాయం వచ్చిందని, దాదాపు 97 లక్షల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని.. 7.31 లక్షల మంది భక్తుల తలనీలాలు సమర్పించారని చెప్పారు.
19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని.. 7.31 లక్షల మంది భక్తుల తలనీలాలు సమర్పించారని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో లక్ష 40 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. 19500 శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయించినట్లు తెలిపారు. సర్వదర్శనం భక్తులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకేన్లు జారీ చేస్తామన్నారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. 10 రోజులు పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేశామని వెల్లడించారు. జనవరి 7వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే జనవరి 10వ తేదీన 8 గంటలకు శ్రీవారి స్వర్ణ రథం ఉరేగింపు ఉంటుందన్నారు.
మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం.. చివరి సమయంలో..
జనవరి 11వ తేదీ ఉదయం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు. పది రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. 10న ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని వారిని దర్శనానికి అనుమతిస్తామని.. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. కియోస్క్ విధానం ద్వారా భక్తులు అందించే విరాళాలు పెరుగుతున్నాయన్నారు. 15 రోజుల వ్యవధిలో 55 లక్షల రూపాయల విరాళాలు అందాయన్నారు. పరకామణిలో చోరి ఘటనపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేస్తుందన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం
బియ్యం మాయం కేసులో అనుమానాలెన్నో..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 28 , 2024 | 11:18 AM