Bhumana: నిజాలు నిగ్గు తేలుతాయ్.. సత్యం వెలుగులోకి వస్తుంది
ABN, Publish Date - Oct 04 , 2024 | 01:32 PM
Andhrapradesh: సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయని భూమన అన్నారు.
తిరుపతి, అక్టోబర్ 4: తిరుమల లడ్డూ (Tirumala Laddu Controversy) వ్యవహారంపై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Former Chairman Bhumana Karunakarreddy) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ సిట్ (CBI SIT) బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. తిరుమల లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఏ విధంగా న్యాయం చేయదు అనేది తమ భావనన్నారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) చెప్పిన తర్వాత ఆయన నియమించిన సిట్ ఏ విధంగా అయినా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగేదని విమర్శించారు. ఈరోజు సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడిందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలుతాయని.. సత్యం వెలుగులోకి వస్తుందన్నారు. తన ఆలయ ప్రతిష్ఠ భంగం కలిగించే వారిపై స్వామివారి చర్యలు ఉంటాయని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
CM Chandrababu Naidu: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: సీఎం చంద్రబాబు
సుప్రీంలో విచారణ..
కాగా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో ఈరోజు (శుక్రవారం) విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. ధర్మాసనం తీర్పు వెలువడక ముందు.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు.
Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ వ్యాపారం.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
‘‘తిరుమల లడ్డూ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. సిట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు’’ అని తుషార్ మెహతా అన్నారు. ఈ మేరకు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కమిటీలో సీబీఐ, రాష్ట్ర పోలీసు విభాగం నుంచి చెరో ఇద్దరు, ఫుడ్ సెఫ్టీ అథారిటీ నుంచి ఒకర్ని స్వతంత్ర సిట్‌లో ఏర్పాటు చేస్తూ కోర్టు నిర్ణయించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో కమిటీ పని చేస్తుంది. కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి సుప్రీం ధర్మాసనం విముఖత చూపింది.
ఇవి కూడా చదవండి..
Durgamma: దుర్గమ్మ దర్శనం.. వీఐపీల కోసం ప్రత్యేక యాప్
AP HighCourt: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 04 , 2024 | 01:52 PM