ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tirumala Updates: బాబోయ్.. బ్యాంకులో వెయ్యి కేజీల బంగారం డిపాజిట్..

ABN, Publish Date - Apr 20 , 2024 | 11:58 AM

తిరుమల(Tirumala) శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ(TTD) గత ఏడాదిలో రికార్డుస్థాయిలో 1,031 కేజీల బంగారాన్ని (దాదాపు రూ.773 కోట్ల విలువ) వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో(Hundi) కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు..

TTD Gold

తిరుమల, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): తిరుమల(Tirumala) శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ(TTD) గత ఏడాదిలో రికార్డుస్థాయిలో 1,031 కేజీల బంగారాన్ని (దాదాపు రూ.773 కోట్ల విలువ) వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో(Hundi) కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా స్వామికి అందుతుంటుంది. పురాతన సంప్రదాయమైన నిలువుదోపిడి నేటికీ కొనసాగుతోంది. తాజా డిపాజిట్‌తో టీటీడీ బంగారం డిపాజిట్లు(Gold Deposits) 11,329 కేజీలకు చేరుకున్నాయి. వీటి విలువ దాదాపు రూ.8,496 కోట్లు ఉండొచ్చని అంచనా.


ఇక, నగదు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయానికి వస్తే 2023–24 ఏడాదికి సంబంధించి రూ.1,161 కోట్లను టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది. 2013 నుంచి పరిశీలిస్తే రూ.608 కోట్లు, 2014లో రూ.970 కోట్లు, 2015లో రూ.961 కోట్లు, 2016లో రూ.1,153 కోట్లు, 2017లో రూ.774 కోట్లు, 2018లో రూ.501 కోట్లు, 2019లో రూ.285 కోట్లు, 2020లో రూ.753 కోట్లు, 2021లో రూ.270 కోట్లు, 2022లో రూ.274 కోట్లు, 2023లో రూ.757 కోట్లు, 2024లో రూ.1,161 కోట్లు డిపాజిట్‌ చేసింది. కొవిడ్‌ అనంతరం గడచిన 25 నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతినెలా రూ.వంద కోట్లకు తగ్గకుండా లభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టీటీడీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.18 వేల కోట్లకు చేరాయి. టీటీడీకి బంగారు, నగదు డిపాజిట్ల ద్వారా ఏడాదికి సుమారు రూ.1,200కోట్లు వడ్డీ రూపంలో అందుతున్నట్టు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 12:00 PM

Advertising
Advertising