ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kuwait: కువైత్‌ చెరలోని మహిళకు విముక్తి

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:11 AM

కువైత్‌లోని ఏజెంట్‌ చెరలో చిక్కుకున్న మన జిల్లా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది.

తిరుపతి, డిసెంబరు23 (ఆంధ్రజ్యోతి): కువైత్‌లోని ఏజెంట్‌ చెరలో చిక్కుకున్న మన జిల్లా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. ఈనెల 27న ఆమె తిరుపతికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆమెకు విమాన టికెట్‌ సిద్ధం చేశారు. బిడ్డలను చదివించుకోవాలని కష్టపడి కువైత్‌కు వెళ్లి నరకకూపంలో చిక్కుకున్న శ్రీకాళహస్తి మండలం రాజీవ్‌ నగర్‌కు చెందిన యల్లంపల్లి లక్ష్మి ఆవేదనను సోమవారం ‘నన్ను చంపి ఎడారిలో పడేస్తామంటున్నారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. ఈ కథనంపై ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. దుబాయ్‌లో ఉన్న తిరుపతికి చెందిన ఏపీఎన్‌ఆర్టీ మాజీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ముక్కు తులసీకుమార్‌తో ఫోన్లో సంప్రదించారు. ఆమెను తిరుపతికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ గిరిధర్‌కు ఆదేశాలిచ్చారు. దీంతో డీఎస్పీ రంగంలోకి దిగి ఆమెను కువైత్‌కు పంపిన పీలేరు ఏజెంట్‌ శ్రీనివా్‌సతో మాట్లాడారు. ఆయన ద్వారా కువైత్‌లోని ఏజెంట్‌తో మాట్లాడి టికెట్‌ పంపారు.

అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సుబ్బరాయుడు

ఉపాధికోసం విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. వెళ్లేముందు మీ పరిధిలోని పోలీ్‌సస్టేషన్‌కు పూర్తి వివరాలు ఇవ్వండి. ఏ దేశానికి, ఎవరిద్వారా, ఎలాంటి పనికి వెళుతున్నారనే సమాచారం ఉండాలి. తద్వారా భవిష్యత్తులో అక్కడేమైనా ఇబ్బందులు తలెత్తితే సులభంగా పరిష్కరించవచ్చు. మోసంచేసే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.


పాస్‌పోర్ట్‌ కోసం ప్రయత్నిస్తున్నాం : డాక్టర్‌ ముక్కు తులసీకుమార్‌, ఏపీఎన్‌ఆర్టీ మాజీ కోఆర్డినేటర్‌

కువైత్‌లో శ్రీకాళహస్తి మహిళ లక్ష్మి విముక్తి కోసం తిరుపతి పోలీస్‌ అధికారులు చూపిన చొరవ అభినందనీయం. పోలీస్‌ అధికారులు నాతో ఫోన్లో మాట్లాడారు. ఇక్కడి ఏజెంట్‌ ద్వారా టికెట్‌ పంపారు. ఇంకా ఆమె చేతికి పాస్‌పోర్టు రాలేదు. రెండు రోజుల్లో పాస్‌పోర్ట్‌ ఆమెకు అందేలా ప్రయత్నిస్తున్నాం.

Updated Date - Dec 24 , 2024 | 01:11 AM