ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: వీళ్లు మారరా.. మరోసారి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై...

ABN, Publish Date - Feb 26 , 2024 | 03:05 PM

Andhrapradesh: అనంతపురం జిల్లా రాప్తాడులో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకల దాడి మరువకముందే చిత్తూరులో మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. సోమవారం కుప్పంలో జరిగిన సీఎం సభలోనూ మరోసారి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసీపీ శ్రేణులు దాష్టీకానికి పాల్పడ్డారు.

చిత్తూరు, ఫిబ్రవరి 26: అనంతపురం జిల్లా రాప్తాడులో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకల దాడి మరువకముందే చిత్తూరులో మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. సోమవారం కుప్పంలో జరిగిన సీఎం సభలోనూ మరోసారి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై (ABN - Andhrajyothy Photographer) వైసీపీ శ్రేణులు దాష్టీకానికి పాల్పడ్డారు. చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శివ కుమార్ మీద దాడికి వైసీపీ శ్రేణులు యత్నించారు. ఇలాంటి పరిస్థితి ఉంటుందని ముందే గ్రహించి అలెర్ట్‌గా ఉన్న శివ కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసుల వద్దకు చేరుకున్నారు. అయితే పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ బాధితుడికి అండగా ఉండాల్సిన పోలీసులు... అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. పోలీసులు కూడా వైసీపీ వాళ్ళకే సహకరించారు. శివ తీసిన ఫోటోలను పోలీసుల సమక్షంలోనే వైసీపీ వాళ్ళు కెమెరా లాక్కుని మరీ డిలీట్ చేసేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో సీఎం జగన్ బహిరంగ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 03:42 PM

Advertising
Advertising