ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన

ABN, Publish Date - Nov 14 , 2024 | 04:47 PM

గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా... బూతులు లేకుండా సభ జరగలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఈ కౌరవ సభ కనుక వెళ్లిపోయి.. ప్రస్తుతం గౌరవ సభలో తాను అడుగుపెట్టానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

CM Chandrababu

అమరావతి, నవంబర్14: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌‌గా ఉండి ఎమ్మెల్యే కె. రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను జైల్లో ఉన్న సమయంలో.. తన రూంలో సీసీ టీవీలు పెట్టి రిమోట్ ద్వారా చూడాలనుకున్నారన్నారు. అయితే గతంలో రఘురామరాజు విషయంలో ఆయన్ను కొడుతూ వీడియో కాల్‌లో చూసారన్నప్పుడు అలా జరగుతుందా? అని అనుకున్నానని చెప్పారు. కానీ తనకు అదే జరిగే సరికి నమ్మాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నాయా? అని పరిశీలిస్తే.. ఇటువంటి వ్యక్తి కొలంబియాలో ఉన్నాడని తెలిసిందని.. అతడి పేరు ప్యాబ్లో ఎస్కోబార్ అని చెప్పారు.

Also Read: రఘురామపై సీఎం చంద్రబాబు ప్రశంసలు


ధనికుడే కాదు దుర్మార్గుడు కూడా..

ఆ దేశంలోనే అత్యంత ధనికుడిగా, దుర్మార్గుడిగా ఖ్యాతి గాంచాడన్నారు. ప్రపంచంలో 80 శాతం కోకైన్ ఆయనే తయారు చేసి.. సరఫరా చేసే వాడని తెలిపారు. ఇక్కడ ఈయన్ని చూస్తే.. డ్రగ్స్, గంజాయి వచ్చిందని వివరించారు.

Also Read: వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ ఫైర్


స్పందనే లేదు..

రానున్న రోజుల్లో గంజాయి విక్రయించినా.. పంట పండించినా తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఎంత మంది విద్యార్థులు గంజాయి తీసుకొని నాశనం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నాటి సీఎం వైఎస్ జగన్ మాత్రం స్పందించలేదన్నారు.


కోర్టే కాపాడింది..

ఇక 1985లో సుప్రీంకోర్టులో గెరిల్లా దాడులు చేసి 11 మంది న్యాయమూర్తులను సైతం దారుణంగా చంపేశారని గుర్తు చేశారు. అలాగే నాటి ఈ ఎంపీ ట్రిపుల్ ఆర్‌ని సైతం అలాగే చంపేవారన్నారు. కానీ కోర్టులు ఉండ బట్టే ఈయన తప్పించుకో గలిగారని చెప్పారు. ఓ మంత్రి పార్లమెంట్‌లో మాట్లాడాడున్నందుకు అతన్ని చంపేశాడని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సైతం ట్రిపుల్ ఆర్ ఎదురొడ్డి నిలబెడ్డారన్నారు. ఒక పోరాటం చేసి.. పోరాట యోధుడుగా గెలిచి ఈ కుర్చీలో కుర్చున్నందుకు ట్రిపుల్ ఆర్‌ను ఈ సందర్బంగా అభినందిస్తున్నానన్నారు.


నేటి స్పీకర్‌పై.. నాడు కేసు

గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా... బూతులు లేకుండా సభ జరగలేదని గుర్తు చేశారు. నాటి ఈ కౌరవ సభ కనుక వెళ్లిపోయి.. ప్రస్తుతం గౌరవ సభలో తాను అడుగుపెట్టానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సభలో ఉన్న వారంతా బాధితులేనని... స్పీకర్‌తో సహా అని చెప్పారు. స్పీకర్‌పై అటెంప్ట్ టూ రేప్ కేసు పెట్టారని వివరించారు. అలాంటి ఆయన ప్రస్తుతం స్పీకర్‌ అయ్యారన్నారు. అలాగే చంపేయాలనుకున్న ఆయన ఇప్పడు డిప్యూటీ స్పీకర్ అయ్యారని తెలిపారు. ఇదే బ్యూటీ ఆఫ్ డెమెక్రసీ అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.


వైనాట్ 175 అంటే..

ఇక వైనాట్ 175 అంటే.. నీకు 11 స్ధానాల్లో గెలిపించారన్నారు. అంటే రాష్ట్రంలో ఇతర పార్టీలకు ప్రతిపక్ష హోదా సైతం తీసేస్తానని చెప్పారని.. కానీ ప్రజలు అదే వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు.. ప్రజలు ఇచ్చేదని విపులీకరించారు. ప్రతిపక్ష హోదా కావాలి.. ఇవ్వకుంటే అసెంబ్లీకి రాను అనే వ్యక్తి చరిత్రలో ఎవ్వరూ లేరన్నారు.


ఇది దేవుడు రాసిన స్క్రీప్ట్ అంటే..

ఆ నాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానీయని వారు.. నేడు మీ ముందు సభలోకి రాలేక కూర్చోలేని పరిస్థితి వచ్చిదంటూ.. వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు పరోక్షంగా విమర్శించారు. ఇది దేవుడు రాసిన స్క్రీప్ట్ అంటే...ఆ రోజు భగవంతుడు చిన్నచూపు చూసి ఉంటే ట్రిపుల్ ఆర్ ను మనం ఈ రోజు ఇక్కడ చూసే వాళ్లం కాదన్నారు.


ఆ భయమే చంపేసేది..

అయితే రఘురామకృష్ణరాజు ఏమాత్రం భయపడి ఉంటే ఆ భయమే ఆయన్ను చంపేసేదన్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా ఆ పదవికి వన్నె తెస్తారని మనస్పూర్తిగా అభినందిస్తున్నాం... అలాగే ఆ కుర్చీ ఔన్నత్యాన్ని పెంచేలా పని చేయాలని కోరుతున్నానంటూ సీఎం చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.


వైసీపీ ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత..

2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా కె. రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. అనంతరం ఆ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. ఇక అదే సమయంలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో రచ్చ బండ పేరుతో ప్రతి రోజు ఎంపీ ట్రిపుల్ ఆర్.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు గుప్పించే వారు. ఆ క్రమంలో వైసీపీ ఎంపీలు సైతం లోక్‌సభ స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అలాగే ఆయనపై అనర్హత వేటు వేయాలని అభ్యర్థించారు.


వీడియో కాల్..

మరోవైపు సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ.. ట్రిపుల్ ఆర్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని జైల్లో చిత్ర హింసలు పెట్టారు. ఆదే సమయంలో వీడియో కాల్ ద్వారా దీనిని నాటి సీఎం వైఎస్ జగన్ వీక్షించారని ట్రిపుల్ ఆర్ ఆరోపించారు. ఇక ఈ కేసు న్యాయస్థానంకు చేరడంతో... ట్రిపుల్ ఆర్‌కు బెయిల్ మంజూరు అయింది.


బేగంపేట రైల్వేస్టేషన్‌లో...

ఇక నరసాపురంలో ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీగా ఆ కార్యక్రమంలో ట్రిపుల్ ఆర్ పాల్గొనాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌లోని లింగపల్లి నుంచి నరసాపుర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆయన బయలుదేరారు. ఇంతలో ఆయన.. బేగంపేట రైల్వే స్టేషన్‌లో దిగి.. ఇంటికి వెళ్లిపోయారు. ట్రిపుల్ ఆర్‌ను అంతమొందించేందుకు పథక రచన జరిగిందంటూ ఓ ప్రచారం అయితే నాడు పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అయింది.


నంద్యాల్లో టీడీపీ అధినేత అరెస్ట్..

ఇక 2023, సెప్టెంబర్ 09వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పోలీసులు నంద్యాల్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని రోడ్డు మార్గంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయనకు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.


53 రోజులు..

దాదాపు 53 రోజులు అనంతరం చంద్రబాబుకు బెయిల్ మంజురు అయింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆ నాటి సంఘటనలను సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా గుర్తు చేశారు.

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Nov 14 , 2024 | 06:57 PM