ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఆర్థిక ఇబ్బందులతో ఏపీ బడ్జెట్‌ పెట్టుకోలేక పోయాం

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:30 PM

ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్‌ పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలను కున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Nara Chandrababu Naidu

అమరావతి: ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్‌ పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనుకున్నామని అన్నారు. వికసిత్ భారత్‌ 2047తో ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో ఇండియా నిలుస్తుందని తెలిపారు. వికసిత్ భారత్‌ వైపు దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి మొదలైందని అన్నారు. గత ఎన్నికల్లో కూటమిని అద్భుత మెజార్టీతో ప్రజలు గెలిపించారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి 57 శాతం ఓట్లు పడ్డాయని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఫలితం ఎప్పుడూ చూడలేదని చెప్పారు.


Also Read:Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి చంద్రబాబు ధన్యవాద తీర్మానం చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఏపీ ఏర్పాటు చేశారని అన్నారు. ఐదేళ్లూ మూడు రాజధానుల పేరుతో వైసీపీ నెట్టుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రానికి మాజీ సీఎం జగన్ రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి అంటే గతంలో మద్రాస్ అనేవారని, తెలుగు జాతి గౌరవాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెంచారని కొనియాడారు. తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్ అనేలా ఎన్టీఆర్ చేశారని గుర్తుచేశారు.


ఆనాడు ఐటీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ఆర్థిక సవరణలతో దేశంలో పెనుమార్పులు వచ్చాయని కొనియాడారు. PPP భాగస్వామ్యంతో దేశంలో బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు చేశారన్నారు. కూటమి విజయం వెనుక అందరి కృషి ఉందని చెప్పారు. గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. జైలుకు వచ్చి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తనను పరామర్శించారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్‌ ముందుకొచ్చారని తెలిపారు. ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ తమతో చేతులు కలిపిందని గుర్గుచేశారు.


‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోటీచేశాం. మళ్లీ మంచిరోజులు ప్రారంభమయ్యాయని ప్రజలు భావించారు. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఏపీని మళ్లీ అభివృద్ధి చేసే వరకు కలిసి పనిచేస్తాం. రాష్ట్ర చరిత్రలో గత ఐదేళ్లు చీకటి రోజులు. ఎక్కడా భూములు, ఆస్తులను వదల్లేదు. మెడపై కత్తిపెట్టి తమ పేరుపై భూములు రాయించుకున్నారు. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు ఎన్నో చూశాం. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసం. అహంకారంతో జగన్‌ విర్రవీగారు. అసమర్థతతో వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారు. మంచి రాష్ట్రాన్నిజగన్‌ సర్వనాశనం చేశారు’’ అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం అందించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం.... ‘‘మన రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024-2025 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌లో రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, గౌరవనీయులు కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్‌జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు. కేంద్రం అందించిన ఈ తొడ్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పునర్నిర్మాణానికి దొహదం చేస్తుంది. ఈ ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే ఈ బడ్జెట్‌ సమర్పించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు

Sujanachowdary: ఏపీ చరిత్రలో చాలా శుభదినం

Pawan Kalyan: అలా చేస్తే కూటమి ప్రభుత్వానికే ఇబ్బంది.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 08:46 PM

Advertising
Advertising
<