Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో జరగబోయేది ఇదే.. మాణిక్కం ఠాగూర్ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Jan 04 , 2024 | 04:37 PM
ఏపీలో జగన్ ఓటమి ఖాయం అన్నారు మాణిక్కం ఠాగూర్. ఏపీలో వైసీపీ గ్రౌండ్ కోల్పోతుందన్నారు. వైఎస్సార్ పేరును వాడటం లేదన్నారు. ఏపీలో ప్రధాని మోదీ, సీఎం జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు మాణిక్కం ఠాగూర్.
Andhra Pradesh: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరడం హర్షణీయం అని అన్నారు ఆ పార్టీ ఏపీ ఇన్‌ఛార్ మాణిక్కం ఠాగూర్. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాణిక్కం ఠాగూర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏపీలో జగన్ ఓటమి ఖాయం అన్నారు. ఏపీలో వైసీపీ గ్రౌండ్ కోల్పోతుందన్నారు. వైఎస్సార్ పేరును వాడటం లేదన్నారు. ఏపీలో ప్రధాని మోదీ, సీఎం జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు మాణిక్కం ఠాగూర్. ఇదే సమయంలో పొత్తులపైనా క్లారిటీ ఇచ్చారు ఠాగూర్. ఏపీలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారాయన.
ఇదే సమయంలో వైఎస్ఆర్‌పైనా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మాణిక్కం ఠాగూర్. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషి అన్నారు. ఆయన తుది శ్వాస వరకు కాంగ్రెస్ కోసమే పని చేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ పేరును వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామన్నారు మాణిక్కం ఠాగూర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. ఇక షర్మిలక చేరికపైనా స్పందించిన ఠాగూర్.. ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.