Non-Venomous : ‘కామన్‌ శాండ్‌ బో’ పాము

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:07 AM

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నెహ్రూ నగర్‌లో ఆదివారం స్థానికులకు ‘కామన్‌ శాండ్‌ బో’ పాము కనిపించింది. రోడ్డు పనులు చేస్తుండగా..

 Non-Venomous :  ‘కామన్‌ శాండ్‌ బో’ పాము

  • పట్టుకొని అడవిలో విడిచిపెట్టిన స్నేక్‌ క్యాచర్‌

పలాస, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నెహ్రూ నగర్‌లో ఆదివారం స్థానికులకు ‘కామన్‌ శాండ్‌ బో’ పాము కనిపించింది. రోడ్డు పనులు చేస్తుండగా.. మూడు అడుగుల పొడవు, నాలుగు అంగుళాల మందంతో శరీరంపై మచ్చలతో ఈ సర్పం కనిపించడంతో ఆందోళన చెందారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్‌ క్యాచర్‌ ఓంకార్‌ త్యాడి, అటవీ సిబ్బంది కృష్ణారావు, రాజు వచ్చి పరిశీలించారు. ఇది విషపూరితమైనది కాదని, కేవలం ఇసుక తిన్నెలు, అటవీ ప్రాంతాల్లో ఈ జాతి పాములు ఉంటాయని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇలాంటి పాము తారసపడడం ఇదే మొదటిసారన్నారు. తనకు హాని జరుగుతుందని పసిగట్టిన వెంటనే.. ఆ పాము ఆత్మరక్షణకు చుట్టుకొని తలను తోక వద్ద దాచుకుంటుందన్నారు. చూసేందుకు భయంకరంగా కనిపించినా ఇది చిన్న చీమలు, కప్పలు, ఎలుకలను తింటుందని, ఎవరికీ హాని తలపెట్టదని తెలిపారు. ‘కామన్‌ శాండ్‌ బో’ పామును పట్టుకుని కోసంగిపురం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Updated Date - Dec 30 , 2024 | 04:07 AM