AP Elections: పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో అయోమయం.. వైసీపీకి కొమ్ముకాస్తూ..
ABN, Publish Date - Apr 19 , 2024 | 07:21 AM
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో అయోమయం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్‌ను నియోజకవర్గ ఆర్వోకు ఇవ్వాలని ఆదేశాలిచ్చినా.. చాలా చోట్ల ఆర్వోలు తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. ఫాం-12 ఎవరికి ఇవ్వాలో తెలియక ఉద్యోగుల్లో అయోమయం చోటు చేసుకుంది. ఈ నెల 22తో పోస్టల్ బ్యాలెట్ గడువు ముగియనుంది..
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో అయోమయం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్‌ను నియోజకవర్గ ఆర్వోకు ఇవ్వాలని ఆదేశాలిచ్చినా.. చాలా చోట్ల ఆర్వోలు తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. ఫాం-12 ఎవరికి ఇవ్వాలో తెలియక ఉద్యోగుల్లో అయోమయం చోటు చేసుకుంది. ఈ నెల 22తో పోస్టల్ బ్యాలెట్ గడువు ముగియనుంది. ప్రభుత్వ ఉద్యోగులు జగన్ (CM Jagan) ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు కోసం భారీగా అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగులను ఓటింగ్‌కు దూరం చేసేందుకు వైసీపీకి కొమ్ముకాసే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పితే విసిగి ఓటింగ్‌కు దూరం అవుతారని కుట్ర పన్నుతున్నారని సమాచారం. ఉపాధ్యాయుల నుంచి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు తీసుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈనెల 22 లోపు వాటిని సమర్పించాల్సి ఉండగా.. దాదాపు 80 శాతం ఉద్యోగులు ఇంకా సమర్పించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ విధులకు 3:30 లక్షల మంది హాజరుకానున్నారు. వైసీపీకి కొమ్ముకాసే కొందరు అధికారులు సృష్టిస్తున్న సమస్యలతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. కొందరు ఉన్నతస్థాయి అధికారుల నుంచి వచ్చిన డైరెక్షన్ లోనే కింది స్థాయి అధికారుల వైఖరి ఉంటోందని విపక్షాలు అంటున్నాయి.
సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లపై ఫిర్యాదులు
ఎన్నికల కోడ్‌కు ముందు రిటర్నింగ్ అధికారులను భారీగా జగన్ ప్రభుత్వం మార్చేసింది. చాలా చోట్ల వైసీపీకి అనుకూలంగా ఉండే వారిని నియమించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ అధికారులు చేస్తున్న పనులతో విపక్ష ఆరోపణలకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇంతవరకూ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి స్పష్టమైన అదేశాలు అందలేదు. ఎన్నికల కమిషన్ సైతం వీటిపై దృష్టి సారించకపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారుల ఆటలు సాగుతున్నాయి. నేటికీ స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిని కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
అనుమతులు లేకుండా ‘సిద్ధం’ ఫ్లెక్సీలు
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 19 , 2024 | 07:35 AM