ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hanuma Vihari: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రికెటర్ హనుమ విహారి..

ABN, Publish Date - Jun 25 , 2024 | 05:37 PM

మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)ను క్రికెటర్ హనుమ విహారి(Hanuma Vihari) మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయంపై మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అమరావతి: మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)ను క్రికెటర్ హనుమ విహారి(Hanuma Vihari) మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయంపై మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా హనుమ విహారి మాట్లాడుతూ.."నా టాలెంట్‌ను గత ప్రభుత్వం తొక్కేసింది. ఒక్క మ్యాచ్ ఆడగానే రిజైన్ చేయాల్సిందే అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. తాము చెప్పిన వారిని టీమ్‌లో పెట్టుకోకపోతే సహించమంటూ నాతో బలవంతంగా రాజీనామా చేయించారు.

ఈ సంఘటన జరిగినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాకు అండగా నిలిచారు. ఏపీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులకు గురి చేశారు. ఆంధ్రాలో క్రికెట్‌ను ఎంకరేజ్ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అందుకే ఎన్ఓసీ తీసుకున్నా కూడా తిరిగి ఏపీకి వస్తున్నా" అని చెప్పుకొచ్చారు.


అయితే వైసీపీ హయాంలో ఓ రాజకీయ నేత కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో హనుమ విహారి చేసిన సోషల్ మీడియా పోస్ట్ సంచలనం సృష్టించింది. రంజీ మ్యాచ్‌ సందర్భంగా 17వ ఆటగాడిపై అరిచానని, దీంతో రాజకీయ నేత అయిన క్రీడాకారుడి తండ్రి తనపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర క్రికెట్ ఆసోసియేషన్‌పై ఒత్తిడి తెచ్చాడని పోస్టులో వెల్లడించారు. ఆయన ఒత్తిడితోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అప్పట్లో తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన లోకేశ్‌ను కలవడంతో తిరిగి ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

AP Politics: PADAలో అవినీతిపై పులివెందుల ప్రజలు ఆలోచించాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

Diarrhea: డయేరియా నేపథ్యంలో జగ్గయ్యపేటలో మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు పర్యటన..

Updated Date - Jun 25 , 2024 | 05:37 PM

Advertising
Advertising