Union Minister Dharmendra Pradhan :మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ భేష్
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:46 AM
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను ..
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఎదుగుదలలో కీలకం
ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శప్రాయమైన మోడల్
సీఎంకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ
న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను నిర్వహించడం పట్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం విజయవంతం కావడానికి చంద్రబాబు దూరదృష్టి గల నాయకత్వం దోహదపడిందన్నారు. ఇటువంటి ఆదర్శప్రాయమైన కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఒక నమునాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యా మంత్రి నారా లోకేశ్‌కు కూడా అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో 72 లక్షల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారని తెలిసి సంతోషిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వారంతా 1.85 లక్షల మంది ఉపాధ్యాయులతో అర్థవంతమైన చర్చలో నిమగ్నమయ్యారని, ఇటువంటి కార్యక్రమం నిస్సందేహంగా ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. వారి మధ్య సృహద్భావ వాతావరణం పిల్లలు చదువులో రాణించడానికి, వారి వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఏపీలోని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విషయాన్ని ఎంపీ అప్పలనాయుడు ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
Updated Date - Dec 22 , 2024 | 04:46 AM