AP Pensions: ఇంకా ప్రారంభం కాని పెన్షన్ల పంపిణీ.. ప్రజల ఆగ్రహం
ABN, Publish Date - Apr 03 , 2024 | 10:38 AM
Andhrapradesh: వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈరోజు నుంచి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి ఆరు వరకు పెన్షన్‌లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు వరకు పెన్షన్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పెన్షన్లు ఇస్తారని తెలిసిన వృద్ధులు, వితంతువులు ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లోని సచివాలయాలకు తరలివచ్చారు.
విజయవాడ, ఏప్రిల్ 3: వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈరోజు నుంచి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం (AP Goverment) సిద్ధమైంది. నేటి నుంచి ఆరవ తేదీ వరకు పెన్షన్‌లు (AP Pensions) ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పెన్షన్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పెన్షన్లు ఇస్తారని తెలిసిన వృద్ధులు, వితంతువులు ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లోని సచివాలయాలకు తరలివచ్చారు. తీరా వచ్చాక అధికారులు చెప్పిన సమాధానం విని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరో కీలక అరెస్ట్..
పెన్షన్ల పంపిణీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న గందరగోళ పరిస్థితికి నిన్నటితో తెరపడింది. నేటి నుంచే పెన్షన్ల పంపిణీ అంటూ సర్కార్ ప్రకటనలు కూడా చేసింది. దీంతో ఎంతో ఆశతో వచ్చిన వృద్ధులు, వితంతువులకు అధికారుల నుంచి నిరాశే ఎదురైంది. డబ్బు అందలేదని మధ్యాహ్నం తరువాత రావాలని సచివాలయ సిబ్బంది చెబుతున్న పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వృద్ధులు వెను తిరిగి వెళ్లిపోతున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ అని ఎందుకు చెప్పారంటూ సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్‌ల పంపిణీ ఉంటుందంటూ అధికారులు నచ్చజెప్పడంతో వృద్ధులు, వితంతులు తిరిగి ఇంటిబాట పట్టారు.
పింఛన్ల పంపిణీపై విధివిధానాలు ఇవే..
కాగా.. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. సెర్ప్ సీఈవో గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి 4 రోజుల పాటు(ఈనెల 6 వరకు) గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, వితంతువులకు ఇంటివద్దే పింఛను సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో లబ్ధిదారులనే గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకునే విధానం ఖరారు చేసినట్టు పేర్కొంది. ఏప్రిల్, మే ఈ రెండు నెలలు ఇదే విధానం అమలవుతుందని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తాయని, పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
Chandrababu: నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ
Delhi: వయనాడ్ నుంచి రాహుల్ లోకసభ నామినేషన్ నేడు..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Apr 03 , 2024 | 11:50 AM