ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: భారీ వర్షాలతో జలాశయాలకు పెరుగుతున్న వరదనీరు..

ABN, Publish Date - Sep 01 , 2024 | 09:28 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకల పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పంటలు నీట ముగిని తీవ్రనష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12:30నుంచి 2:30 మధ్య వాయుగుండం తీరం దాటింది.

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకల పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పంటలు నీట ముగిని తీవ్రనష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12:30నుంచి 2:30 మధ్య వాయుగుండం తీరం దాటింది. క్రమంగా బలహీనపడుతూ వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా వాయుగుండం పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతవరకు వర్షాలు తగ్గుముఖం పడతాయని, చాలా చోట్ల చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


ప్రకాశం బ్యారేజీ..

భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరదనీరు చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గంటగంటకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. 70గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తి 5,66,860 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు 500క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5,66,860 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 15అడుగులకు చేరుకుంది. పులిచింతల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.


మరోవైపు కృష్ణాజిల్లా దివిసీమ వద్ద వరద ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 5.66లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తుండడంతో పులిగడ్డ వద్ద 16అడుగులకు వరదనీరు చేరింది. నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం వద్ద శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది. దీంతో ఎదురుమొండి దీవులు జలదిగ్బంధంలో ఉన్నాయి.


నాగార్జునసాగర్ ప్రాజెక్టు..

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 4,91,792క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5,01,114క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుతం 588.90అడుగులకు చేరుకుంది. అలాగే డ్యాం నీటిసామర్థ్యం 312టీఎంసీలు కాగా.. 308.76టీఎంసీలకు చేరుకుంది.


పులిచింతల ప్రాజెక్టు..

మరోవైపు పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత ఇన్‌ప్లో 6,82,000క్యూసెక్కులు కాగా... ఔట్ ప్లో 6,71,000క్యూసెక్కులుగా ఉంది. దీంతో పులిచింతల 23గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 42.16టీఎంసీలకు చేరుకుంది.


శ్రీశైలం జలాశయం..

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 3,56,472క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,72,390క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 8గేట్లు 18అడుగులు, 2గేట్లు 10అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885.00అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.9198టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


అయితే కృష్ణానది ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. పడిపోయిన విద్యుత్ లైన్లు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం ఏమాత్రం చేయవద్దంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - Sep 01 , 2024 | 10:12 AM

Advertising
Advertising