Share News

భారీ వర్షాలకు రత్నగిరిపై విరిగిపడిన కొండచరియ

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:27 AM

అన్నవరం, సెప్టెంబరు 6: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరిపై కొండచరియ విరిగిపడింది. శుక్రవారం రాత్రి ఆదిశంకర్‌ మార్గ్‌లో జరిగిన ఈ సంఘటనలో ఎ

భారీ వర్షాలకు రత్నగిరిపై విరిగిపడిన కొండచరియ

అన్నవరం, సెప్టెంబరు 6: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరిపై కొండచరియ విరిగిపడింది. శుక్రవారం రాత్రి ఆదిశంకర్‌ మార్గ్‌లో జరిగిన ఈ సంఘటనలో ఎవరికి ఎటు వంటి ప్రమాదం సంభవించలేదు. కొ ండచరియ విరిగి డ్రైనేజీ ఆనుకునిపడగా చిన్నచిన్న రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిఉన్నాయి. అధికారులు హుటాహుటిన వీటిని తొలగింపు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడకుండా ఉండేందుకు గతంలో సాంకేతిక నిపుణుల బృం దం వచ్చి పలు సూచనలు చేశారు. ఆదిశంకర్‌ మార్గ్‌లో రాకపోకలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 12:27 AM