1,47,122 వ్రతాలతో ఆల్ టైం రికార్డు
ABN , Publish Date - Dec 01 , 2024 | 11:56 PM
అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీకమాసం సందడి హరిహర క్షేత్రమైన సత్యదేవుడి ఆల యంలో ఆదివారంతో ముగిసింది. కార్తీకమాసం నెలరోజుల్లో ప్రతీఏటా 15 రోజులు పర్వదినాలు మిగిలిన 15రోజులు సాధారణ రోజులుగా ఉండే వి. ఈ ఏడాది మాత్రం కార్తీకమాసం ప్రారం భం నుంచి రద్దీ నాలుగైదు రోజులు మినహా ఒకే విధంగా సాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా వ్రతాల సంఖ్య ఆల్ టైం రికార్డు నెలకొల్పి
సత్యదేవుని సన్నిధిలో ముగిసిన కార్తీకమాస సందడి
నేడు హుండీల లెక్కింపు
రూ.20 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా
అన్నవరం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీకమాసం సందడి హరిహర క్షేత్రమైన సత్యదేవుడి ఆల యంలో ఆదివారంతో ముగిసింది. కార్తీకమాసం నెలరోజుల్లో ప్రతీఏటా 15 రోజులు పర్వదినాలు మిగిలిన 15రోజులు సాధారణ రోజులుగా ఉండే వి. ఈ ఏడాది మాత్రం కార్తీకమాసం ప్రారం భం నుంచి రద్దీ నాలుగైదు రోజులు మినహా ఒకే విధంగా సాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా వ్రతాల సంఖ్య ఆల్ టైం రికార్డు నెలకొల్పి 1,47,122 వ్రతాలు జరిగాయి. వీటిలో రూ.300 వ్రతాలు 1,6,901, రూ.1000 వ్రతాలు 17,714, రూ.1500 వ్రతాలు 10,269, రూ.2000 వ్రతాలు 12,238 జరిగాయి. ఈ ఏడాది కార్తీకమాసంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అలయ అధికారులు చర్యలు తీసుకోవడంతో త్వరితగతిన వ్రతాలు, దర్శనాలు పూర్తిచేసుకోగలిగారు. ప్రధానంగా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగనివ్వలేదు. గిరి ప్రదక్షిణ మధ్యాహ్నం సత్యరఽథంతో ప్రారంభించడం సత్ఫలితాలు ఇచ్చింది. పడమట రాజగోపురం వద్ద కంపార్టమెంట్లు ఏర్పాటు, క్యూలైన్‌లు పొడిగించడంతో సాధ్యమైం ది. ఈ ఏడాది కార్తీకమాసంలో అన్ని విభాగాల ద్వారా సుమారు రూ.20 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సోమవారం జరిగే హుండీల లెక్కింపుతో లెక్కతేలిపోనుంది. ఒక్క వ్రతాల ద్వారా సుమారు రూ.8కోట్లు ఆదాయం రావొచ్చని అంచనా. కౌంటర్లలో 143708 వ్రతం టిక్కెట్లు విక్రయించగా ఆన్‌లైన్ ద్వారా 3414 టిక్కెట్లను భక్తులు బుకింగ్ చేసుకున్నారు. వ్రతపురోహితులు, సిబ్బంది సముష్టిగా కృషి చేశారు.
సత్యదేవునికి మంత్రి సుభాష్ పూజలు
రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో ఆది వారం మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబసభ్యులతో స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ప్రోటోకాల్ సూప రింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.