ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:44 PM

సీపీ హయాంలో ఐదేళ్లపాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu Naidu

అంబేడ్కర్ కోనసీమ: వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రావాలంటే పరదాలు కట్టాలని, ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు చేయాల్సిందే అంటూ ధ్వజమెత్తారు. బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన 'గ్రామసభ'లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో వచ్చే ఐదేళ్లపాలనలో చేసే పనులు, వివిధ పథకాల అమలు గురించి ముఖ్యమంత్రి వివరించారు.


జగన్‌ను భూస్థాపితం చేయాలి..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. " పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్డీయే. సింపుల్ గవర్నెస్ సింపుల్ గవర్నమెంట్ మాది. గ్రామ అవసరాల కోసమే పనులు చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు కోసం కాదు. ఉపాధి హామీ పథకం ద్వారా 100 పని దినాలు కల్పించేందుకు రూ.4,500 కోట్లు మంజూరు చేశాం. 87 పనులు ద్వారా రూ.54లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేశారు. 57శాతం ఓట్లు వేసి 93శాతం గెలిపించారు. జగన్ లాంటి భూతాన్ని భూస్థాపితం చేయాలి. జగన్‌కు రంగుల పిచ్చి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం వేసిన దీపాల్లో 43శాతం వెలగకుండా చేశారు.


ఐదేళ్లల్లో గ్రామాలకు మహర్దశ..

ఏపీలో రానున్న ఐదేళ్ల పాలనలో గ్రామాలకు రూ.2,100కోట్లు అందిస్తాం. రాష్ట్రవ్యా్ప్తంగా 17,500కిలోమీటర్లు మేర గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తాం. 10 వేల కిలోమీటర్ల సిమెంట్ డ్రైనేజీలు నిర్మిస్తాం. 2,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తాం. పశువుల కోసం షెడ్లు నిర్మిస్తాం. చెత్త నుంచి సంపద సృష్టిస్తాం. కూలీల రేట్లు పెంచుతాం. గ్రామీణ ప్రాంతంలో ప్రతీ కుటుంబానికి మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు భూమి ఇస్తాం. ప్రతి కుటుంబానికీ ఇళ్లు కట్టించి ఇస్తాం. త్వరలోనే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులు జగన్ గాలికొదిలేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం ఆయన దుర్వినియోగం చేశారు.


ఉచిత ఇసుక మీ ఇంటికే..

ఆంధ్రప్రదేశ్‌లో రూ.10లక్షల కోట్ల అప్పులతో పాలన ప్రారంభించాం. కేంద్రంలో మనం కీలకంగా ఉన్నాం. రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా. మాజీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష హోదా కావాలని గోల చేస్తున్నారు. వాలంటీర్లు లేకుండా తొలిరోజే 99శాతం పింఛన్లు ఇచ్చి రికార్డు సృష్టించాం. 203 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం పెడతాం. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం తెచ్చాం. సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇసుక మీ ఇంటికే వచ్చేలా చేస్తున్నాం. ప్రస్తుతం ఏపీలో వర్షాలు కురవడం మనకు శుభసూచిక. పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ రూ.980కోట్లతో నిర్మిస్తాం" అని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Ravindra: అచ్యుతాపురం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారు..

Savita: ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్ దే

Updated Date - Aug 23 , 2024 | 06:44 PM

Advertising
Advertising
<