ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఆ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం ... పరిహారం ప్రకటన

ABN, Publish Date - Nov 04 , 2024 | 10:02 AM

పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ని తాడిపర్రులో ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో కరెంట్ షాక్‌తో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు.క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాసంశెట్టి సుభాష్

కోనసీమ జిల్లా: తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం చోటు చేసుకున్న ప్రమాదం కలచి వేసిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు.


తాడిపర్రు ఘటనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి

తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం, తాడిపర్రు ఘటనపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.


ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్.. నలుగురు మృతి..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా... ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఇవాళ (సోమవారం) ఉదయం ఈ ఘటన జరిగింది. పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న కరెంట్‌ వైర్లు తగలడంతో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. మృతులను గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరో బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతితో తాడిపర్రులో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి

84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 04 , 2024 | 12:21 PM