ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: కాకినాడలో 'డి' గ్యాంగ్..వాటా ఇవ్వకపోతే బయట అడుగుపెట్టలేరు

ABN, Publish Date - Dec 03 , 2024 | 08:07 PM

కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం అంత సులువు కాదు. వ్యాపారి ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా ఇక్కడున్నా డీ గ్యాంగ్‌కు అడిగినంత ఇచ్చుకోవాలి. లేదంటే బయట వ్యాపారుల నిలువలేని పోర్టు గేట్లు కూడా తాకలేవు.

కాకినాడ: కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం అంత సులువు కాదు. వ్యాపారి ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా ఇక్కడున్నా డీ గ్యాంగ్‌కు అడిగినంత ఇచ్చుకోవాలి. లేదంటే బయట వ్యాపారుల నిలువలేని పోర్టు గేట్లు కూడా తాకలేవు. ఇలా వైసీపీ జమానాలో డీ అంటే దోపీడీ అన్నట్లుగా సాగింది. గత ఐదేళ్లు రాజకీయ దందాతో కాకినాడ పోర్టు కొందరు ప్రవేట్ వ్యక్తుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది అంతర్జాతీయ స్థాయిలో అక్రమాల వ్యవహారం సాగింది. బడా నేత అంతర్జాతీయ స్థాయిలో దోచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడి ఓచోట నేత మాత్రం అధికార అండతో చక్రం తిప్పేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన అడ్డగోలు దోపిడికి దర్పణంగా నిలిచింది.


కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం ఎగుమతి చేసేందుకు మహారాష్ట్రాలోని నాగాపూర్ జిల్లా లడక్ గంజ్‌కు చెందిన శ్రీరామ్ ఫుడ్స్ ఇండస్ట్రీస్ యజమాని అనుప్ గోయల్ కాకినాడలో గత ఏడాది ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కోట్లలో లంచాలు ఇస్తే తప్ప సరుకు కదలదని కొందరు బెదిరించారని కాకినాడకు చెందిన కీలక ఎగుమతిదారులు చిన్నబాబు రెడ్డి, విపెన్ ఆగర్వాల్, లక్ష్మీ వెంకటేశ్వర్, హైజిన్ ఫుడ్స్ డైరెక్టర్ బీవీ కృష్ణారావుపై గత ఏడాది నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక నేరాల విభాగం ఈవోడబ్ల్యూ ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది.


ఈ విషయంపై అప్పట్లో మహారాష్ట్ర మీడియా కోడై కూసింది. నాగపూర్ వ్యాపారి అనుపు గోయల్‌కు చెందిన 30 వేల టన్నుల బియ్యాన్ని చెంగల్‌కు ఎగుమతి చేయడానికి కాకినాడకు చెందిన ఎగుమతిదారుల సంఘం నిరాకరించింది. దీంతో రంగంలోకి దిగిన కొంతమంది సమస్యను పరిష్కరించడానికి రూ. 2.49 కోట్లు చిన్నబాబురెడ్డికి కంపం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అనుప్ గోయల్ రూ. 1.68 కోట్లు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ సొమ్మును సంగం ఖాతాకు కాకుండా లక్ష్మీ వెంకటేశ్వర హైజిన్స్ ఫుడ్ ఖాతాకు బదిలీ చేయాలని వారు సూచించారు. అయితే సొమ్ము చెల్లించిన నాగపూర్ వ్యాపారి బియ్యం నిల్వలు చెంగల్‌కు చేరుకున్న తర్వాత అక్రమ వసూళ్లపై లెక్కర్ గంజ్ పోలీసులకు 2023 ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశాడు.

Updated Date - Dec 03 , 2024 | 08:07 PM