Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...
ABN, Publish Date - Jul 11 , 2024 | 01:24 PM
Andhrapradesh: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
తూర్పుగోదావరి, జూలై 11: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి అభినందనీయమని కొనియాడారు. సూపర్ ఫైన్ రకం బియ్యం పేదలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తొందరలోనే కాయగూరల ధరలు కూడా తగ్గించే ప్రయత్నం చేపడతామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
YSRCP: వైసీపీ అధిష్టానంపై మండిపడ్డ కదిరి మాజీ ఎమ్మెల్యే
పేదలపై భారాన్ని తగ్గిస్తాం: ఎంపీ పురందేశ్వరి
పేదలకు చెందాల్సిన బియ్యాన్ని కొంతమంది దారి మళ్ళిస్తున్నారని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఘనంగా ఆహ్వానించారన్నారు. ఈ ప్రభుత్వంలో పేదలకు, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. పేద ప్రజల మీద ధరల భారాన్ని తగ్గిస్తామన్నారు. నాణ్యత కలిగిన కందిపప్పును ప్రజలకు అందిస్తున్నామని ఎంపీ చెప్పుకొచ్చారు.
Raj Tarun: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్
వైసీపీ నేతలపై మండిపడ్డ ఎమ్మెల్యే
గడచిన ఐదు సంవత్సరాలుగా మధ్యతరగతి వాళ్ళు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (MLA Adireddy Vasu) అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఇన్నాళ్లు వైసీపీ నేతలు వారి జేబులు , కడుపులు నింపుకున్నారని మండిపడ్డారు. నాణ్యతకు సంబంధించి అధికారులతో పాటు నాయకులు కూడా బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?
Telangana: బిగ్ షాక్.. ‘రైతుబంధు’పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 11 , 2024 | 01:24 PM