ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala Ramanaidu: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:32 AM

Andhrapradesh: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు.

Minister Nimmala Ramanaidu

ఏలూరు, జూలై 3: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు. నీటి విడుదలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు లభ్యం కానుంది.

ఈ చట్టాలతో ప్రజలకు న్యాయం చేరువవుతుందా?


అందుకు జగన్ వైఖరే కారణం...

ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ... పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని.. ఈ పట్టిసీమ పథకం బంగారు పథకంగా మారిందని చెప్పుకొచ్చారు. ప్రతీ ఏడాది 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామన్నారు. గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 35 టీయంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉండేదని.. అయితే ఇప్పుడు కేవలం అర టీయంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని.. అందుకు జగన్ (YSRCP Chief Jagan) వైఖరి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేశామన్నారు. రాబోయే మూడు రోజుల్లో నీటి విడుదల సామర్ధ్యాన్ని 8500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామన్నారు.

Hyderabad: తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్‌.. అల్లాపూర్‌లో కిడ్నాపర్లు?


సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు...

తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశామని తెలిపారు. లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుందన్నారు. ఒకేరోజు పట్టిసీమ, తాడిపూడి, పుష్కరం, పురుషోత్తపల్లి ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేయడం చరిత్ర అని గర్వంగా చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన జగన్, అంబటి రాంబాబు ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చారని.. పోలవరం అథారిటీని, కేంద్ర జలవనరుల సంఘాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్‌ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తప్పులు సరిదిద్దుకోకుండా విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

BNS Act: బీఎన్‌ఎస్ యాక్ట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై మొట్టమొదటి కేసు...

AP News: ఆగని అక్రమ రేషన్ తరలింపు.. తాజాగా

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 10:36 AM

Advertising
Advertising