ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Gorantla: ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం: ఎమ్మెల్యే గోరంట్ల

ABN, Publish Date - Jun 19 , 2024 | 09:31 PM

ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

రాజమండ్రి: ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151సీట్లు గెలిచినప్పుడు మాత్రం బాగా పనిచేశాయా అంటూ ప్రశ్నించారు. బ్యాలెట్ విధానం తీసుకురావాలని జగన్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు.


జగన్ ప్రజాదనం దుర్వినియోగం చేసి రుషికొండపై ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేసినట్లు తమ ప్రభుత్వం కూల్చివేయదని, ప్రభుత్వ కార్యక్రమాలకు వాటిని ఉపయోగిస్తామన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవటం వల్లే తనకు ప్రొటెం స్పీకర్ అవకాశం వచ్చిందన్నారు. ఈనెల 21న జరిగే అసెంబ్లీ సమావేశాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చిస్తుందని వెల్లడించారు.

Updated Date - Jun 19 , 2024 | 09:31 PM

Advertising
Advertising