పూడిక తీత పనుల పరిశీలన
ABN , Publish Date - Sep 04 , 2024 | 12:14 AM
సామర్లకోట, సెప్టెంబరు 3: పట్టణ పరిధిలో పలు ప్రధాన డ్రైన్లలో సుదీర్గకాలంగా పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పరిశీలించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి రైల్వే గేట్ వరకూ గల ప్రధాన డ్రైన్‌లో పూడికత తొలగింపు పనులను పరిశీలించి డ్రైన్‌లో
సామర్లకోట, సెప్టెంబరు 3: పట్టణ పరిధిలో పలు ప్రధాన డ్రైన్లలో సుదీర్గకాలంగా పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పరిశీలించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి రైల్వే గేట్ వరకూ గల ప్రధాన డ్రైన్‌లో పూడికత తొలగింపు పనులను పరిశీలించి డ్రైన్‌లో ఎటు వంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు. పట్టణంలో పలు ప్రధాన డ్రైన్లలో పూడిక తొలగింపు పనులకు రూ.36 లక్షల నిధుల వెచ్చిస్తున్నం దున పనులు పూర్తయితే ముంపు సమస్య సామర్లకోట కు ఇక ఉండబోదన్నారు. పనులు పూర్తి పారదర్శకంగా జరిగేలా కూటమి నాయకులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.