వాడీవేడిగా కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:19 AM
పెద్దాపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిం చిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం వాడీవేడిగా సాగింది.
అధికారులపై ధ్వజమెత్తిన కౌన్సిలర్లు
పెద్దాపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిం చిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం వాడీవేడిగా సాగింది. చైర్‌ప ర్సన్ బొడ్డు తులసీమంగతా యారు అధ్యక్షత న నిర్వహించిన సమావేశంలో కౌన్సిలర్లు ము న్సిపల్ అధికారులపై ధ్వజమెత్తారు. కౌన్సిలర్ పప్పల దుర్గారావు మున్సిపల్ షాపింగ్ కాంపె ్లక్స్‌ల అద్దెల విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్ మాట్లాడుతూ శతాబ్ది పార్కులో సౌకర్యాలు మెరుగుపరచా లని, పాండవుల మెట్ట వద్ద ఉన్న జర్నలిస్టు కాలనీకి తాగునీటి వసతికోసం పైప్‌లైన్ నిర్మాణం చేయకపోవడానికి గల కారణమేంట ని ప్రశ్నించారు. పట్టణంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, సచివాయల సిబ్బందిని వినియోగించుకోలేకపోవడం ఏంట ని నిలదీశారు. కౌన్సిలర్ విడదాసరి రాజా మాట్లాడుతూ స్థానిక మెయిన్ రోడ్డు వేముల వారి జంక్షన్‌లో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మా ణానికి సంబంధించి మున్సిపల్ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. కౌన్సిలర్ ఆకుల కృష్ణబాపూజీ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల అన్యాంక్రాంతాన్ని అడ్డుకోవాలన్నారు. అరెళ్ల వీర్రాఘవరావు మాట్లాడుతూ పాత పెద్దాపుర ంలో ఒకటవ వార్డులో జంగిల్ క్లియరెన్స్ చే యాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కమిషనర్ కేవీ పద్మావతి, డీఈ ప్రకాశరావు, ఏఈ జీవ ప్రసాద్, ఆర్వో వి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.