Andhra Pradesh: ఏమైపోయారు..వీళ్లంతా!?
ABN, Publish Date - May 24 , 2024 | 12:39 AM
మీకు మేమున్నాం.. మీ సమస్యేంటో చెప్పండి క్షణాల్లో పరిష్కరిస్తాం.. ఓటరు వెళ్లి అడిగిందే తడవు.. ఏ పనైనా రోజులో జరిగి పోయేది.. పోలింగ్ ముందు వరకూ ఇదీ సీన్.. మరిప్పుడు.. నాయకులు కనిపించడమే మానేశారు.. పోలింగ్ ముగిసిన నాటి నుంచి నాయకులు బయటకే రావడంలేదు.. కొంత మంది తమ నాయకుడు విదేశాలకు వెళ్లిపోతే.. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు..
జిల్లా అంతటా జగన్మాయ
పోలింగ్ తర్వాత అంతా మాయం
జగన్ బాటలోనే కొందరు..
మరి కొందరు ఇంటికే పరిమితం
కనిపించని ఆపద్ధర్మ పాలకులు
వైసీపీ కేడర్‌లో తీవ్ర నైరాశ్యం
సమస్యలు గాలికొదిలేశారు..
ప్రజల ఎదురుచూపులు
నిరుత్సాహంలో మండిపాటు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): మీకు మేమున్నాం.. మీ సమస్యేంటో చెప్పండి క్షణాల్లో పరిష్కరిస్తాం.. ఓటరు వెళ్లి అడిగిందే తడవు.. ఏ పనైనా రోజులో జరిగి పోయేది.. పోలింగ్ ముందు వరకూ ఇదీ సీన్.. మరిప్పుడు.. నాయకులు కనిపించడమే మానేశారు.. పోలింగ్ ముగిసిన నాటి నుంచి నాయకులు బయటకే రావడంలేదు.. కొంత మంది తమ నాయకుడు విదేశాలకు వెళ్లిపోతే.. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు.. స్థానికంగా ఉన్న వారు సైతం ఇళ్లకే పరిమితమవుతున్నారు.. నాయకులు ప్రజలకు అందు బాటులో లేకపోవడంతో.. ఏమైపోయారో వీళ్లంతా అనుకుంటూ.. మా నాయకులు కనిపించడం లేదంటూ.. ప్రకటనలు ఇస్తామంటూ ప్రజలు సెటైర్లు వేసుకుంటున్నారు.. వై నాట్ 175 అని ఊదరగొట్టిన వైసీపీ నాయకులు పోలింగ్ అయిన తర్వాత జనాల్లో కనిపించడం లేదు.
పంకా అధినేత ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోగా.. రెక్కలు తోచిన దిక్కునకు తుర్రుమంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటై పాలకులు ప్రమాణ స్వీకారం చేసే వరకూ ప్రస్తుతం పదవుల్లో ఉన్న వాళ్లు ఆపద్ధర్మ(కేర్ టేకర్) పాలకులుగా ఉంటారు. కానీ పోలింగ్ సరళి నిశితంగా గమనించుకున్న వైసీపీ నేతలు మాత్రం పదవులు ఇక లేనట్లే అనే నైరాశ్యంలో మునిగిపోయినట్టు కనిపిస్తు న్నా రు. అంతే పోలింగ్ తర్వాత రోజు నుంచి కనిపించడమే మానేశారు. కొంత మందికి ఇంటికే పరిమితమైతే మరి కొంత మంది ఊరు దాటిపోయిన తీరు వారిలో కనిపి స్తోంది. దీంతో వారి క్యాడర్ కూడా అయోమయంలో చిక్కుకుంది. రానున్న రోజులు గడవడంపై దృష్టి సారిం చాయి. వైసీపీ అభ్యర్థులుగా పోటీలో నిలిచిన వారికి భవి ష్యత్ రాజకీయ జీవితం చీకటిగా కనిపిస్తుండడంతో ఎవ రికీ అందుబాటులో ఉండడం లేదనే చర్చ నడుస్తోంది.
‘ఆపద్ధర్మం’ మరిచారా?
ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధుల ద్వారా లోక్‌సభ, శాసన సభలు ఏర్పాటవుతాయి. వాటి కాల పరిమితి ముగిసినా లేదా రద్దయినా ఆయా ప్రజా ప్రతినిధులు పదవులను కోల్పోతారు. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అలాంటి సమ యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరిగే వరకూ ప్రజలకు ఇబ్బందులకు కలుగకుండా కొన్ని పరిమితులకు లోబడి అప్పటి వరకూ పదవుల్లో ఉన్న వారు పాలన సాగిస్తారు. దీనినే ఆపద్ధర్మ(కేర్ టేకర్ గవర్నమెంట్) ప్రభుత్వం అంటారు. రాష్ట్రపతి, గవర్నర్ కోరిక మేరకు ప్రధాని, ముఖ్యమంత్రి ఆపద్ధర్మంగా కొనసాగుతారు. మంత్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఆపద్ధర్మ ప్రభువులు విధాన నిర్ణ యాలు తీసుకోడానికి వీల్లేదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నడుచుకోరాదు. బడ్జెట్ తయారీ, ఆర్డినెన్సుల జారీ, ఉన్నతాధికారుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటివి చేయకూ డదు. రోజు వారీ ప్రభుత్వ కార్యకలాపాలను మాత్రమే ఆపద్ధర్మ ప్రభుత్వం నడిపిస్తుంది. కార్యనిర్వాహక బాధ్యతలు నెరవేరుస్తుంది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చవచ్చు. ఒక రకంగా ప్రజలకు అందుబా టులో ఉండాల్సిందే. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ పాలకుల్లో గతంలో ఎన్నడూ లేని వింత పరిస్థితి కనిపిస్తోంది. ఐదేళ్లు అయిపోయింది. ఇక ప్రజల సమస్యలు మనకెం దుకు అనే తీరుతో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరి సొంత పనులు వాళ్లు చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ప్రజాప్రతినిధులు కనిపించరే..
పోలింగ్ రోజున హల్‌చల్ చేసిన వైసీపీ అభ్యర్థులు, నాయకులు తర్వాత ప్రజలకు దూరంగా గడుపుతున్నారు. అధినేత దగ్గర నుంచీ కింది స్థాయి కార్యకర్త వరకూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. మొదటిగా ఆపద్ధర్మ సీఎం జగన్ లండన్‌కి లగ్జరీ విమానంలో వెళ్లిపోయారు. తర్వాత జిల్లాల్లోని నేతలు కూడా అధినేత మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఆయా అభ్యర్థుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రాజమహే ంద్రవరం వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. ప్రతిరోజూ ప్రెస్‌మీట్లతో ముని గితేలేవారు.. అభివృద్ధి అంతా నేనే చేశానంటూ ఏదో ఒక మూల కనిపించేవారు.. సోషల్ మీడియానూ ఖాళీ ఉం చేవారు కాదు. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచీ ఆయన ప్రజలకు అందుబాటులో లేరు. రూరల్ వైసీపీ అభ్యరి,్థ ఆపద్ధర్మ మంత్రి వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం నుంచి రాజకీయ బదిలీపై ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే.స్థానికంగా క్యాడర్ లేకపోయినా ఎన్నికల ముం దు గత రెండు నెలలుగా ఎక్కడో చోట కొబ్బరికాయ కొడుతూ రోజూ మీడియాలో కనబడుతూ ఉండేవారు. అయినా స్థానికంగా కనబడడం లేదు. కొవ్వూరు వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు దేవరపల్లికి పరిమితమయ్యా రు. నిడదవోలు వైసీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడు హైద రాబాద్ చేరుకున్నారు. కొవ్వూరు నుంచి బదిలీపై గోపాల పురం బదిలీపై వెళ్లిన ఆపద్ధర్మ హోంమంత్రి తానేటి వనిత సొంత పార్టీ నేతలతో విసిగిపోయి తీవ్ర ఆవే దనకు గురయ్యారని తెలుస్తోంది. తనకు ఓట్లు పడేలా చేస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారని బాధ ను వెళ్లగక్కినట్లు చెబుతున్నారు. ఆమె కూడా ఇంటి పట్టున గడుపుతున్నారు. అనపర్తి వైసీపీ అభ్యర్థి సత్తి సూర్య నారాయణ రెడ్డి ఎన్నికల వరకూ మధ్యాహ్నం సమయంలో రోగులను పరీక్షించేవారు. పోలింగ్ తర్వాత సమయాన్ని పూర్తిగా వైద్యానికి కేటాయిస్తున్నారు. రాజాన గరం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా సర్వేలు చేసుకుం టూ సమీక్షలు నిర్వహించుకుంటూ గడుపుతున్నారు. ఇది లా వైసీపీ నేతల క్యాడర్, సిబ్బంది డీలా పడిపోయారు. సర్వేలు కూటమి వైపు విజయాన్ని చూపుతుండడం, పోలింగ్ సరళి కూడా అదే స్పష్టం చేస్తుండడంతో వైసీపీ ప్రజా ప్రతినిధులు నిస్తేజంగా గడుపుతుండడంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని క్యాడర్ వాపోతున్నారు.
ప్రజల నిరుత్సాహం..
ప్రజా సమస్యలను గాలికొదిలేశారు.. నియోజక వర్గం లో ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరించాల్సిన బాధ్యత నాయకులదే. అయితే ఆ దిశగా నాయకులు ఎవరూ ఆలోచించడంలేదు. ఇదిలా ఉండగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వారంలో మళ్లీ నాయకులంతా నియోజకవర్గాల బాటపడ తారు. ఏంటి సార్ ఇది అని నాయకులను అడిగితే ఏం చేస్తామయ్యా బాబు రెండు నెలలు నిద్రాహారాల్లేకుండా ఎన్నికలకు పనిచేశాం.. ప్రజల సమస్యలు చూస్తే.. మా సమస్యలెవరు చూస్తారని అంటుండం గమనార్హం. అయితే 2019 ఎన్నికల్లో ఓటు వేసి అధికారం కట్టబెట్టిన ప్రజలు మాత్రం పాలకుల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుత్సాహంతో ఏ ప్రభుత్వం వచ్చినా మళ్లీ మరో ఐదేళ్లకు తీర్పు ఇచ్చేశాం.. ఇక మాతో పని ఎందుకుంటుంది అని మండిపడుతున్నారు.ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రతిరోజూ నియోజకవర్గాల్లో తిరుగుతూ సమస్య లేంటో తెలుసుకుంటున్నారు.
Updated Date - May 24 , 2024 | 10:41 AM