Share News

2 గంటల్లో ముంబై వెళ్లొచ్చు

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:10 AM

రాజమహేంద్రవరం, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కేవలం రెండు గంటల్లోనే రాజమహేం ద్రవరం నుంచి ముంబైకి వెళ్లవచ్చని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం (మధురపూడి) విమా నాశ్రయం నుంచి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తొలిసారిగా ముంబైకి నేరుగా విమాన సర్వీసు

2 గంటల్లో ముంబై వెళ్లొచ్చు
విమాన సర్వీసును ప్రారంభించి కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రి దుర్గేష్‌, ఎమ్మెల్యేలు

రాజమహేంద్రవరం టూ ముంబైకి ఎయిర్‌బస్‌

ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కేవలం రెండు గంటల్లోనే రాజమహేం ద్రవరం నుంచి ముంబైకి వెళ్లవచ్చని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం (మధురపూడి) విమా నాశ్రయం నుంచి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తొలిసారిగా ముంబైకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించి మాట్లాడారు. ఎయిర్‌ బస్సు సర్వీసుతో రాజమహేంద్రవరం, ముంబైకి మధ్య దూరం తగ్గిందన్నారు. ఈ నెల 12 నుంచి న్యూఢిల్లీకి ఇక్కడ నుంచి విమాన సర్వీసు ఆరంభమవుతుందన్నారు. కేంద్ర మంత్రి రామ్మో హనాయుడు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పట్టుదలతో ఎయిర్‌బస్‌ సర్వీసును వేశారన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జ్ఞానేశ్వరరావు మాట్లాడు తూ ప్రతి రోజూ సాయంత్రం 4.50 గంటలకు ముంబై నుంచి బయలుదేరి రాజ మహేంద్రవ రం ఎయిర్‌పోర్టుకు 6.45 గంటలకు చేరుతుంద న్నారు. ఈ ఎయిర్‌బస్సు రాత్రి 7.15 గంటలకు ఇక్కడ నుంచి తిరిగి బయలుదేరి రాత్రి 9.05 గంటలకు ముంబై చేరుకుంటుందని చెప్పారు. తొలిరోజు అరగంట ఆలస్యంగా ఎయిర్‌బస్‌ వచ్చి నట్టు చెప్పారు. ముంబై, రాజమహేంద్రవరం మధ్య కేవలం గంట 50 నిమిషాల ప్రయాణం ఉంటుందన్నారు. తొలిరోజు ముంబై నుంచి 172 మందితో రాజమహేంద్రవరం వచ్చిందని చెప్పా రు. తిరిగి ఈ ఎయిర్‌బస్సులో 120 మంది ముంబై వెళ్లారని తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి రాజమహేంద్రవరం నుంచి నేరుగా న్యూఢిల్లీకి ఇండిగో విమాన సర్వీసు ఆరంభమవు తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంక టేశ్వరరావు, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ నేతలు నీరుకొండ వీరన్నచౌదరి, జవ్వాది లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:10 AM