ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP FLOODS: ఏలేరు జలాశయానికి వేగంగా పెరుగుతున్న ఇన్ ఫ్లో

ABN, Publish Date - Sep 08 , 2024 | 10:11 PM

ఏలేరు జలాశయానికి ఇన్ ఫ్లో వేగంగా పెరుగుతోంది. ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం కాగా 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.24 టీఎంసీలకు నీటిమట్టం చేరుకుంది.

కాకినాడ జిల్లా: ఏలేరు జలాశయానికి ఇన్ ఫ్లో వేగంగా పెరుగుతోంది. ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.24 టీఎంసీలకు నీటిమట్టం చేరుకుంది. 12వేలు క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో భారీగా చేరుతుండడంతో 5700 క్యూసెక్కులు వరద నీరు దిగువకు అధికారులు వదులుతున్నారు.


అర్ధరాత్రికి 10వేలు క్యూసెక్కులు వరదనీరు దిగువకు వదిలే అవకాశం ఉంది. ఏలేరు వరద కారణంగా ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు ముంపు బెడద ఎక్కువగా ఉంది. తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిత్యావసరాలు, తాగునీరు, మందులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆదేశించారు.


పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటికే సుద్దగడ్డ వాగు వరద కారణంగా గొల్లప్రోలులో పలు కాలనీలు పంట పొలాలు నీట మునిగాయి. ఏలేరు వరద కూడా తోడవ్వడంతో ముంపు భారీగా పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు ప్రజలు, రైతులు ఆందోళనలో ఉన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 10:12 PM

Advertising
Advertising