ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: మంత్రి లోకేశ్ చొరవతో ఇండియాకి వస్తున్న సౌదీ బాధితుడు..

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:10 PM

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో సౌదీ అరేబియాలో చిక్కుకున్న బాధితుడు ఇండియాకు సురక్షితంగా వస్తున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు, యువకుణ్ని బుధవారం రోజున దేశానికి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో సౌదీ అరేబియాలో చిక్కుకున్న బాధితుడు ఇండియాకు సురక్షితంగా వస్తున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు, యువకుణ్ని బుధవారం రోజున దేశానికి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు.


అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన యువకుడు సారెళ్ల వీరేంద్ర కుమార్ ఓ ఏజెంట్ ద్వారా పని చేసేందుకు సౌదీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన బాధితుణ్ని ఎడారి ప్రాంతంలో పనికి పెట్టి ఏజెంట్ మోసం చేశాడు. చేసేదేమీ లేక కొద్ది రోజులు పని చేసిన యువకుడు తాను పడుతున్న బాధలను వీడియో తీసి వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నారా లోకేశ్ తనను ఆదుకుంటామని, ధైర్యంగా ఉంటాలని చెప్పారు. దేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని బాధితుడు వీరేంద్ర కుమార్‌కు హామీ ఇచ్చారు.


యువకుణ్ని దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. దీంతో సౌదీలోని ఇండియన్ ఎంబసీతో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ మాట్లాడారు. బుధవారం రోజున సౌదీ అరేబియా దామామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకురానున్నారు. దీనిపై యువకుడి కుటుంబసభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని ఇంటికి తెచ్చేందుకు కృషి చేసిన లోకేశ్‌కు తల్లిదండ్రలు ధన్యవాదాలు చెప్తున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 03:12 PM

Advertising
Advertising
<