ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gorantla: గుడ్డలూడదీస్తా... ఖబడ్దార్.. మార్గాని భరత్‌కు గోరంట్ల హెచ్చరిక

ABN, Publish Date - Mar 22 , 2024 | 02:05 PM

Andhrapradesh: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు గంజాయి చీడ పాకి పోయిందన్నారు. పోలీసులకు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి సమాచారం ఇస్తే కానీ ఇక్కడి యంత్రాంగం మేలుకోలేదని ఎద్దేవా చేశారు.

రాజమండ్రి, మార్చి 22: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP MLA Gorantla butchaiah chowdary)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు గంజాయి చీడ పాకి పోయిందన్నారు. పోలీసులకు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి సమాచారం ఇస్తే కానీ ఇక్కడి యంత్రాంగం మేలుకోలేదని ఎద్దేవా చేశారు. దర్యాప్తు చేస్తున్న సంస్థలకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందన్నారు.

డ్రగ్స్ అమ్మి ఆ డబ్బులను ఎన్నికలలో ఖర్చు పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది చిన్న విషయం కాదు భారీ కుంభకోణమని... సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలు అప్పులలో ఏపీ రాష్ట్రం నెంబర్ వన్ స్థాయిలో నిలిచిందన్నారు. మార్గని భరత్ (Margani Bharath) ఓ పిచ్చోడని.. నోటికి వచ్చినట్టు మాట్లాడుతారని మండిపడ్డారు. ఇలా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘‘నిన్నటి దాకా గంజాయి స్మగ్లర్ చోటును పక్కన పెట్టుకొని తిరిగింది నువ్వు కాదా ...? నీ గంజాయి బ్యాచ్‌ను తీసుకొచ్చి నాకు ఆపాదించాలని చూస్తే గుడ్డలూడదీస్తా.... ఖబడ్దార్’’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

Big Breaking: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

ISRO: ఇస్రో మరో ఘనత.. పునర్వినియోగ రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 03:19 PM

Advertising
Advertising