Janasena : కీలక నేతను సస్పెండ్ చేసిన జనసేన అధిష్టానం.. కారణమిదే..
ABN, Publish Date - Dec 19 , 2024 | 09:20 AM
జనసేన నేత వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకల్లో మద్యం ఏరులై పారింది. అమ్మాయిలతో పూర్తి అశ్లీలంగా డ్యాన్సులు చేయించడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఏలూరు: నిడమర్రు మండలంలో అశ్లీల నృత్యాలపై పోలీసులు కేసు నమోదు నమోదు చేవారు. జనసేన పార్టీ కీలక నాయకుడిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ నెల 15వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా అశ్లీల నృత్యాలను జనసేన నాయకుడు ఏర్పాటు చేశాడు. ఏబీఎన్‌లో కథనం ప్రసారం కావడంతో పోలీసులు స్పందించి చర్యలు చేపట్టారు.
కాగా.. క్రొవ్విడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు. అయితే ఈ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. దీంతో పాటు అమ్మాయిలతో పూర్తి అశ్లీలంగా డ్యాన్సులు చేయించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ నేతను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. క్రొవ్విడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు కావడంతో డిసెంబర్15వ తేదీ రాత్రి సమీపంలోని బావాయిపాలెం రైస్‌మిల్లులో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏడు గంటల నుంచి నిర్వహించిన పార్టీలో మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్‌వెజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ భోజనాలు చేసి వెళ్లిపోయారు.
అర్ధరాత్రి సమయానికి మిగిలిన కొందరు యువకులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. అప్పటికప్పుడు సమీప పట్టణానికి చెందిన కొందరు యువతులను పిలిపించి నృత్యాలు చేయించారు. అప్పటికే పూటుగా మద్యం సేవించిన వీరు ఆ మహిళలను పూర్తిగా వివస్త్రలను చేయించడం కలకలం రేపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు నిడమర్రు ఎస్‌ఐ ఎన్.వీరప్రసాద్ తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఇంద్రకుమార్‌ను సస్పెండ్ చేసింది. నిడమర్రు మండల కన్వీనర్ నిమ్మల దొరబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఇంద్రకుమార్‌పై సోషల్ మీడియాలోనూ, కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్‌లోనూ వచ్చిన వార్తల ఆధారంగా, అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారనే ఆరోపణల దృష్ట్యా ఇంద్రకుమార్‌ను జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Cabinet meeting: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
Pawan Kalyan: ‘జల్‌జీవన్’లో జనం భాగస్వామ్యం
Kakinada: డమ్మీ పిస్టల్‌తో బెదిరించి.. బంగారం దోచేసి..!
Read Latest AP News and Telugu News
Updated Date - Dec 19 , 2024 | 09:24 AM