ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: వైసీపీ హై కమాండ్‌కు అసమ్మతి నేతల హెచ్చరిక.. కారణమిదే..!

ABN, Publish Date - Feb 11 , 2024 | 05:27 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో అసమ్మతి నేతలు వరుసగా గళం వినిపిస్తున్నారు. ప్రజామోదం లేని నేతలను రాబోయే ఎన్నికల్లో నిలబెట్టవద్దని ఆ పార్టీ హై కమాండ్‌కు అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే రంగనాథరాజుని అచంట నియోజకవర్గం నుంచి నిలబెట్టవద్దని అధిష్ఠానానికి సూచిస్తున్నారు.

పశ్చిమ గోదావరి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో అసమ్మతి నేతలు వరుసగా గళం వినిపిస్తున్నారు. ప్రజామోదం లేని నేతలను రాబోయే ఎన్నికల్లో నిలబెట్టవద్దని ఆ పార్టీ హై కమాండ్‌కు అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే రంగనాథరాజుని అచంట నియోజకవర్గం నుంచి నిలబెట్టవద్దని అధిష్ఠానానికి సూచిస్తున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో నియోజకవర్గ నాలుగు మండలాల వైసీపీ నేతలు ఆదివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రంగనాథరాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కనీస గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

రంగనాథరాజు ఒక నటుడని.. ఆయనకు నియోజకవర్గంలో ఓటుతో గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని వైసీపీ అసమ్మతి నేతలు హెచ్చరించారు. రంగనాథరాజు విఫలమైన నాయకుడని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఏ సామాజికవర్గ నాయకుడితో కూడా ఆయన గౌరవంగా మాట్లాడలేదన్నారు. రంగనాథరాజు లాంటి ప్రజాప్రతినిధి తమకు అవసరమా..? అని వైసీపీ అసమ్మతి నేతలు అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఎమ్మెల్యే రంగనాథరాజు చెడ్డపేరు తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేవలం జగన్ వల్లే రంగనాథరాజుకి ఓటు వేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో చాలా మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆచంట నియోజకవర్గంలో రంగనాథరాజుకి ఎమ్మెల్యే సీటు ఇస్తే వైసీపీ హై కమాండ్‌కు త్వరలోనే తమ కార్యాచరణను ప్రకటిస్తామని వైసీపీ అసమ్మతి నేతలు హెచ్చరించారు.

Updated Date - Feb 11 , 2024 | 05:32 PM

Advertising
Advertising