ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: లోకల్ vs నాన్ లోకల్.. మండపేటలో మొనగాడు ఎవరు.. ?

ABN, Publish Date - Mar 27 , 2024 | 11:14 AM

ఏపీలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. టీడీపీ, జనసేన బీజేపీ కూటమికి, వైసీపీకి మధ్య నువ్వా, నేనా అన్నట్లు పోటీ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దశాబ్దానికి పైగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అందులో కోనసీమ జిల్లాలోని మండపేట (Mandapeta) ఒకటి. అంతకుముందు ఆలమూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న మండపేట.. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2008లో మండపేట నియోజక వర్గంగా ఏర్పడింది.

ఏపీలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. టీడీపీ, జనసేన బీజేపీ కూటమికి, వైసీపీకి మధ్య నువ్వా, నేనా అన్నట్లు పోటీ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దశాబ్దానికి పైగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అందులో కోనసీమ జిల్లాలోని మండపేట (Mandapeta) ఒకటి. అంతకుముందు ఆలమూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న మండపేట.. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2008లో మండపేట నియోజకవర్గంగా ఏర్పడింది. రాయవరం, మండపేట, కపిలేశ్వరపురం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 2009లో మొదటిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే గెలుస్తూ వస్తుంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగోసారి ఇక్కడి నుంచి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

AP Politics: సంక్షేమ పాలన కోసం టీడీపీని గెలిపించాలి: వసంత కృష్ణ ప్రసాద్

లోకల్ vs నాన్ లోకల్..

మండపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా జోగేశ్వరరావు పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. వైసీపీకి ఈ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి లేకపోవడంతో గత రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని 2014లో గిరిజాల వెంకటస్వామి నాయుడును బరిలో దించినా ఉపయోగం లేకపోయింది. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరున్న సీనియర్ రాజకీయ నాయకుడు తోట త్రిమూర్తులను వైసీపీలో చేర్చుకుంది. తోట త్రిమూర్తులు సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. అప్పట్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు ఉండటంతో తోట త్రిమూర్తులను మండపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. అప్పటినుంచి తోట త్రిమూర్తులు మండపేటపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా వైసీపీ అధిష్టానం తోట త్రిమూర్తులను అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ జోగేశ్వరరావును ప్రకటించింది. దీంతో మండపేటలో లోకల్ vs నాన్ లోకల్‌గా పోరు మారింది.

విజయ అవకాశాలు ఎవరికి..

మండపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ వేగుళ్ల జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తారనే పేరుంది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జోగేశ్వరరావు ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు. స్థానికంగా అందుబాటులో ఉంటారనే పేరుతో పాటు.. ప్రజల మనిషిగా నియోజకవర్గ ప్రజలు ఆయనను గుర్తిస్తారు. పార్టీలకు అతీతంగా ఆయనను నియోజకవర్గం ప్రజలు అభిమానిస్తుంటారనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం నాలుగో సారి ఆయనకు టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గంలో కాపు, బీసీ శెట్టిబలిజ, దళిత సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం జనసేన మద్దతు టీడీపీకి ఉండటంతో వేగుళ్ల నాలుగో సారి గెలుస్తారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి పొత్తులో భాగంగా ఈసీటును జనసేన ఆశించింది. అయితే టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ సీటును జనసేన వదులుకోవల్సి వచ్చింది. ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు అధికంగా ఉండటంతో ఇప్పటికే ఈ నియోజకవర్గం నాయకులతో పవన్ సమావేశమై.. కూటమి గెలుపునకు సహకరించాలని కోరారు. దీంతో కూటమి అభ్యర్థి జోగేశ్వరరావు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభావం ఎంత?

గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో పోలిస్తే తోట త్రిమూర్తులను బలమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. రామచంద్రాపురం మండపేటకు పక్కన ఉండే నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఆయనకు పరిచయాలు ఎక్కువుగా ఉన్నాయి. మరోవైపు సొంత సామాజిక వర్గం బలం ఆయనకు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. జనసేనకు ఈ సీటు ఇవ్వకపోవడంతో జనసేనకు చెందిన నాయకులను ఆయన ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే జనసేనలో కీలకంగా ఉన్న నాయకులను కలిసి.. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే జనసేనలో కొంతమంది తోట త్రిమూర్తులుకు మద్దతు పలుకుతున్నట్లు ప్రచారం జరగుతోంది. గత రెండేళ్లుగా మండపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాపు సామాజిక వర్గం మినహిస్తే మిగిలిన సామాజిక వర్గాల్లో ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. గతంలో ఆయనపై ఉన్న అనేక ఆరోపణలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇద్దరు బలమైన వ్యక్తులు కావడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. మండపేట మొనగాడు ఎవరో జూన్ 4న తేలనుంది.

AP News: ఎన్నికల నిబంధనలు ఆ నలుగురు అధికారులకి వర్తించవా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 11:14 AM

Advertising
Advertising