ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఏపీ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:31 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024)పై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024)పై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశలో సీఈఓ ముకేష్ కుమార్ మీనా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. సెన్సిటివిటి, నోడల్ అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే , ఫెయిడ్ హాలిడే, అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై ఢిల్లీ నుంచి సహచర ఎన్నికల కమిషనర్లతో కలిసి సీఈసీ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... ప్రశాంత, స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర తాయిలాల ప్రభావాన్ని కట్టుదిట్టంగా నియంత్రించాలని అన్నారు.

AP Elections: జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం.. పెన్షన్ల పేరిట నీచ రాజ‌కీయం..

ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు తనిఖీల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌కు 48 గంటలు ముందు ప్రలోభాల నియంత్రణపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేలా పోలింగ్ కేంద్రాలుండాలని సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్నిపార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలివ్వాలని చెప్పారు. జల, రోడ్డు, వాయు మార్గాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతి యుతంగా, హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ చర్యలు తీసుకోవాలని రాజీవ్ కుమార్ ఆదేశించారు.

Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 10:50 PM

Advertising
Advertising