Egg Rate: బాబోయ్.. కొండెక్కిన కోడిగుడ్డు ధర!

ABN, Publish Date - Aug 06 , 2024 | 09:16 AM

కోడి గుడ్డు (Egg) ధర కొండెక్కింది. దీంతో సామాన్యులు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బహిరంగ మార్కెట్లో కూరగాయలు ధరలు మండిపోతుంటే కోడి గుడ్ల ధరలు సైతం..

Egg Rate: బాబోయ్.. కొండెక్కిన కోడిగుడ్డు ధర!

కర్నూలు జిల్లా/కొలిమిగుండ్ల : కోడి గుడ్డు (Egg) ధర కొండెక్కింది. దీంతో సామాన్యులు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బహిరంగ మార్కెట్లో కూరగాయలు ధరలు మండిపోతుంటే కోడి గుడ్ల ధరలు సైతం అందనంత ఎత్తుకు చేరుకున్నాయని ప్రజలు వాపోతున్నారు. గత ఏప్రిల్‌లో రూ.4 నుండి రూ.4.50 వరకు పలికిన కోడ్డి గుడ్ల ధరలు, మే నెలలో రూ.5, 5.50కు చేరాయి. ఇక జూన్‌, జూలై నెలల్లో అంతకంతకూ పెరుగుతూ కొద్ది రోజుల్లోనే రూ.6.00, రూ.6.50కు చేరుకోవడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మారుమూల పల్లెల్లో చిల్లరగా అయితే కోడి గుడ్లు రూ.7.50 వరకు విక్రయిస్తున్నట్లు గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. ఎంతో కాలంగా చికెన్‌, మటన్‌ (Chicken, Mutton Price) ధరలు మండుతుండటంతో, పలువురు మాంసాహారులు కోడి గుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కోడి గుడ్ల ధరలు కూడా అమాంతం పెరగడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.


Egg.jpg

డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకనే..

మార్కెట్లో కోడి గుడ్ల వినియోగం భారీగా పెరిగింది. సాయంత్రం అయితే చాలు తోపుడు బండ్లపై ఆమ్లెట్లు, న్యూడిల్స్‌ తదితర ఫాస్ట్‌ ఫుడ్‌లో గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వినియోగానికి తగినంత ఉత్పత్తి పెరగకపోవడంతోనే గుడ్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో ప్రతి రోజూ లక్షకు పైగా కోడి గుడ్ల వినియోగం జరుగుతున్నట్లు వ్యాపార వర్గాల అంచనా. జిల్లాకు అత్యధికంగా మహబూబ్‌నగర్‌, హైదరాబాద్, బెంగళూరు నుంచి గుడ్లు దిగుమతి జరుగుతుంది. వర్షాకాలం ప్రారంభమైనందున గుడ్ల ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

Updated Date - Aug 06 , 2024 | 09:20 AM

Advertising
Advertising
<