Kesineni Chinni: కేశినేని చిన్ని ఆధ్వర్యంలో టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు..
ABN, Publish Date - May 09 , 2024 | 01:28 PM
కేశినేని చిన్ని (శివనాథ్ ) ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
విజయవాడ: కేశినేని చిన్ని (Kesineni Chinni) ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ.. నేడు ముదిరాజ్ వర్గం చాలా వెనుకపడి ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వం లో వారికి కనీస ప్రోత్సాహం లేదన్నారు. ఒక్క ఛాన్స్ అని అంటే నమ్మి ఓటు వేశారన్నారు. ఇప్పుడు తప్పు తెలుసుకుని టీడీపీలోకి చేరడం సంతోషమన్నారు.
Loksabha polls: అర్ధరాత్రి వచ్చి డబ్బులిస్తారు.. డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం..: రేణుకా చౌదరి
టీడీపీ అధినేత చంద్రబాబు సారధ్యంలో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని కేశినేని చిన్ని అన్నారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని... మీకు మేలు చేసిన పార్టీ అని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబుల వల్లే బీసీలు ఆర్ధికంగా ఎదిగారన్నారు. ఓటు ప్రాధాన్యతను అందరికీ చెప్పాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండని సూచించారు. పది మందికి చెప్పి.. కూటమి పార్టీలకు ఓటు వేయించాలని కేశినేని చిన్ని తెలిపారు. మీకు న్యాయం జరగాలంటే మళ్లీ చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.
Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..
ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్..
వైసీపీలో నియంతృత్వ విధానాలతో విసిగి పోయాం. పదేళ్లు వైసీపీ కోసం పని చేసినా గుర్తింపు లేదు. సూట్ కేసులు ఇచ్చిన వాళ్లకే నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అదేంటని అడిగితే మమ్మల్నే ఇబ్బందులు పెట్టారు. బీసీలకు న్యాయం చేసిన సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబులే. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట ముంచారు. అందుకే మా ముదిరాజ్ సంఘం మొత్తం వైసీపీని వీడాం. కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో టీడీపీలో చేరాం. టీడీపీ విజయంతోనే మాకు మేలు జరుగుతోంది. మాతో సహా బీసీ సంఘాలన్నీ టీడీపీతోనే నడుస్తాయి.
ఇవి కూడా చదవండి...
Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..
AP Election 2024: ఆ 48 గంటలు కీలకం అప్రమత్తంగా ఉండండి
Read latest Telangana News And Telugu News
Updated Date - May 09 , 2024 | 01:29 PM