మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఏపీ పోలీసులపై ఎన్నికల సంఘం వేటు..!

ABN, Publish Date - Apr 23 , 2024 | 09:34 PM

ఏపీ పోలీసులపై కేంద్ర ఎన్నిల సంఘం వేటు వేసింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి సహకరించారని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తీసుకురావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ రామాంజనేయులపై బదిలీ వేటు వేసింది.

AP Election 2024: ఏపీ పోలీసులపై ఎన్నికల సంఘం వేటు..!

అమరావతి: ఏపీ పోలీసులపై కేంద్ర ఎన్నిల సంఘం వేటు వేసింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి సహకరించారని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తీసుకురావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ రామాంజనేయులపై బదిలీ వేటు వేసింది. ఆయనను తక్షణం బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. మరి కాసేపట్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. అలాగే విజయవాడ సీపీ కాంతి రానా టాటాపై కూడా బదిలీ వేటు వేసింది. సీఎం జగన్ రెడ్డి రోడ్ షోలో రాయి దాడి ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


AP Election 2024: వలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించొద్దు.. సీఈఓ మీనాకు కూటమి నేతల వినతి

గులకరాయ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం ప్రయాణిస్తున్న ప్రాంతంలో కరెంటు లేకపోవడం ఏంటని ప్రశ్నించింది. అయినా సీఎంను బస్సుపైన నిలబెట్టి ఎన్నికల ప్రచారం చేయించడంపై ఏపీ పోలీసు అధికారులపై సీరియస్ అయింది. సీఎంపై దాడి ఘటన తదనంతర పరిణామాలపైన సీపీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశించింది. అధికారపార్టీతో వీరు ఇరువురు అంటకాగుతున్నారని ఆరోపణలు రావడంతో ఈసీ చర్యలు చేపట్టింది. ఇంటలిజెన్స్ చీఫ్‌పై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ చర్యలకు ఉపక్రమిచింది. వీరి స్థానంలో ముగ్గురు పేర్లతో ప్యానెల్‌కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సీఈవో మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.


AP Election 2024: ఈ సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది... జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 09:53 PM

Advertising
Advertising