AP Elections: బాబాయి కోసం అబ్బాయి.. అదరగొట్టాడుగా..
ABN, Publish Date - Apr 27 , 2024 | 09:45 PM
ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఓవైపు రాజకీయ నాయకులు, మరోవైపు సినీ నటులు కొన్ని పార్టీలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం కొడవలిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తన బాబాయిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

అధికారంతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని వరుణ్ తేజ్ తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకపోయినా.. కౌలు రైతుల సమస్యలపై పోరాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారాన్నారు. నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్న నాయకుడిని ఈ ప్రాంత ప్రజలు గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్‌కి ఒక కొడుకుగా ప్రచారం చేయడం సంతోషంగా ఉందన్నారు. పిఠాపురం ప్రాంత ప్రజల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ తన బాబాయిపై ఉండాలన్నారు.
YSRCP Manifesto 2024: మళ్లీ గెలిస్తే.. అమ్మ ఒడి పెంపు: సీఎం జగన్
భారీ మెజార్టీతో గెలిపించాలి..
వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిఠాపురం ప్రజలు గెలిపించాలని వరుణ్ తేజ్ కోరారు. ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా పవన్ కళ్యాణ్ భావిస్తారన్నారు. ఇక్కడి ఓటర్లు ఆశీర్వదించి పవన్ కళ్యాణ్‌ను చట్టసభలకు పంపిస్తే.. అందరికి సేవకుడిగా ఉంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల గొంతుకగా ఉంటారని, అన్యాయాన్ని ఎదిరించే రాజకీయ నాయకుడని అన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో నాగబాబు ప్రచారం చేస్తుండగా.. తాజాగా వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో మెగా ఫ్యామిలీకి చెందిన మరికొంతమంది పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh and Telugu News Here
Updated Date - Apr 27 , 2024 | 09:46 PM