ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం.. సీఎం రమేష్ అరెస్ట్.. హై టెన్షన్!!

ABN, Publish Date - May 04 , 2024 | 07:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు (AP Elections) సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. ఈ గొడవలో కూటమికి మద్దతిస్తున్న వ్యక్తి గంగాధర్‌ను ముత్యాల నాయుడు వర్గం కొట్టింది. అయితే.. తన మనిషిని ఎందుకు కొట్టారు..? ఆయన చేసిన తప్పేంటి..? అని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) ప్రశ్నిస్తూ.. పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సైతం విర్రవీగి ప్రవర్తించి సీఎం రమేషన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో అనకాపల్లిలో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది. మాడుగుల నియోజకవర్గంలోని తారువ గ్రామంలో రమేష్‌ను అరెస్ట్ చేసి.. పోలీసు జీపులో తరలించారు.

మరోవైపు.. వైసీపీ నేతలు రమేష్‌పై దాడికి యత్నించడం గమనార్హం. దీంతో ప్రస్తుతం మాడుగుల వైసీపీ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు నెలకొన్నాయి. అటు ముత్యాల నాయుడు వర్గం.. ఇటు రమేష్ వర్గం భారీగా స్టేషన్ దగ్గరికి చేరుకున్నాయి. దీంతో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది. ఈ క్రమంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు, ముత్యాల వర్గం.. రమేష్ కాన్వాయ్‌పై దాడిచేసి.. కారు అద్దాలు పగులగొట్టారు.


రిలీజ్ చేయండి..!

సీఎం రమేష్ అరెస్టుతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె కన్నెర్రజేశారు. రమేష్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని.. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను కుట్రపూరితంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులతో ఈ పనులు చేయిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. మరోవైపు రమేష్ అరెస్ట్ కూటమిలోని కీలక నేతలు తీవ్రంగా స్పందించారు. వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


అసలేం జరిగింది.. ఎందుకీ రచ్చ!

శనివారం నాడు బీజేపీ శ్రేణులు.. అనకాపల్లి పరిధిలోని పలు గ్రామాల్లో అగ్రికల్చర్ డ్రోన్స్‌ ఉపయోగించి బీజేపీ జెండాను ఎగురవేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామం తారువ గ్రామంలో కూడా బీజేపీ శ్రేణులు డ్రోన్ ఎగురవేశారు. అయితే, బీజేపీ శ్రేణులపై ముత్యాలనాయుడు, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న బీజేపీ నేత, ముత్యాల నాయుడి మొదటి భార్య తమ్ముడి.. నేరుగా ముత్యాలనాయుడి వద్దకు వచ్చి ప్రశ్నించారు. తననే ప్రశ్నిస్తావా..? అంటూ రెచ్చిపోయిన ముత్యాలనాయుడు.. తన బావమరిది అని కూడా చూడకుండా అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడికి తెగపడ్డారు. ఆయన వెంటపడి ఇంట్లోకి చొరబడి, తలుపులు బద్దలుకొట్టి కిరాతకంగా దాడి చేశారు. దీంతో బాధిత నేత పోలీస్ స్టేషన్‌లో ముత్యాలనాయుడిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ముత్యాలనాయుడు కొత్త డ్రామాకు తెరలేపారు. డ్రోన్స్ సహాయంతో తనపై నిఘాపెట్టి, హత్యాయత్నానికి కుట్ర చేస్తున్నారంటూ ముత్యాలనాయుడు ఆరోపిస్తున్నారు.

Updated Date - May 04 , 2024 | 07:45 PM

Advertising
Advertising