Lok Sabha Polls 2024: అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే.
ABN, Publish Date - May 13 , 2024 | 11:08 AM
అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు కాగా.. మిగతా అభ్యర్థులంతా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది. ఈవీఎంలో ప్రధానపార్టీ అభ్యర్థుల గుర్తులు ముందువరుసలో ఉంటాయి. ఆ తరువాత రిజిస్టర్డ్ పార్టీలు, స్వంతంత్ర అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. ఓటువేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుల ఆధారంగా ఓటు వేయ్యొచ్చు. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ ఈవీఎంలో ఉంటుంది. ఆ పేరు ఎదురుగా ఉన్న బటన్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేయ్యొచ్చు.
AP Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్..
అనకాపల్లిలో 15మంది
అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు కాగా.. మిగతా అభ్యర్థులంతా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్‌లో మొదట బీఎస్పీ అభ్యర్థి శ్రీరామమూర్తికి చెందిన గుర్తు ఉండగా.. ఆతరువాత రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి వేగి వెంకటేశ్‌కు చెందిన గుర్తులు ఉన్నాయి.
AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Updated Date - May 13 , 2024 | 11:08 AM