AP Elections: మైలవరంలో వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీపీ
ABN, Publish Date - May 03 , 2024 | 01:54 PM
Andhrapradesh: ఎన్నికల వేళ అధికారపార్టీ వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి...
ఎన్టీఆర్ జిల్లా, మే 3: ఎన్నికల (AP Elections 2024) వేళ అధికారపార్టీ వైసీపీకి (YSRCP) మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో (TDP) చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మైలవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్(TDP Candidate Vasanta Venkata Krishnaprasad) ఆమెకు పసుపు కండువా కప్పి టీడీపీలోనికి స్వాగతించారు. ఎంపీపీతో పాటు వివిధ గ్రామాలకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.
Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్
రెడ్డిగూడెం మండలానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు రామినేనిని బుజ్జి, రామినేని వెంకటేశ్వరరావు, బొల్లారెడ్డి అంజి రెడ్డి, ఆకుల సుబ్రహ్మణ్యం, బలుసు శ్రీను, కూరేళ్ళ మాధవాచారి, జల్లి సుబ్బారావు, పొన్నూరు సుబ్బారావు, పొన్నూరు వెంకటేశ్వరరావు, కందుల రామారావు, వీరితోపాటు దాదాపు 60 మంది కుటుంబాలకు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఇవి కూడా చదవండి...
Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు
Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు
Read Latest AP News And Telugu News
Updated Date - May 03 , 2024 | 03:03 PM