AP Elections: ఓటమికంటే జగన్‌ను వెంటాడుతున్న మరో భయం!?
ABN, Publish Date - Mar 24 , 2024 | 02:59 PM
వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓడిపోతామనే అంచనాకు వచ్చారా..? సిట్టింగ్‌లను మార్చినా.. ఓటు పడదని గ్రహించారా..? ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు కుట్రలకు తెరలేపారా..? అధికారం కోల్పోతే ఏం జరుగుతుందో ముందే ఊహించారా..? అంటే తాజా పరిణామాలు, జగన్ చేస్తున్న రాజకీయాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓడిపోతామనే అంచనాకు వచ్చారా..? సిట్టింగ్‌లను మార్చినా.. ఓటు పడదని గ్రహించారా..? ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు కుట్రలకు తెరలేపారా..? అధికారం కోల్పోతే ఏం జరుగుతుందో ముందే ఊహించారా..? అంటే తాజా పరిణామాలు, జగన్ చేస్తున్న రాజకీయాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది.
2018లో కోడికత్తి, 2019లో వివేకానందరెడ్డి హత్య, 2024లో గీతాంజలి, తాజాగా విశాఖ డ్రగ్స్ కేసులు చూస్తుంటే.. ఎలాగైనా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలన్న ఆశ తప్ప.. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదనేది జగన్ ఆలోచనగా ఉందనే చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో అధికారంలోకి రావడం, ప్రతిపక్షంలో ఉండటం సర్వ సాధారణం. ప్రజామోదం ఉంటే రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదే ప్రజలు వ్యతిరేకిస్తే విపక్షంలో ఉంటాం. కాని జగన్ మాత్రం అధికారం పోతే తాను చేసిన అరాచకాలకు తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోననే భయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమి కంటే జగన్‌ను ఈ భయమే ఎక్కువుగా ఆందోళనకు గురి చేస్తోందట.
జగన్ భయం ఇదీ..!
తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూసి.. తరువాత తన పరిస్థితి ఇంతేనా..? అనే ఆందోళనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. సీఎం చెప్పారు కదా అని.. ఫోన్ ట్యాపింగ్ చేయడంతో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో మనందరం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కొందరు పోలీస్ ఉన్నతాధికారులు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. అదే ఏపీలో అయితే ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పక్షంలోని నేతల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు జగన్ ప్రభుత్వంపై ఉన్నాయి. మరోవైపు ఇసుక దందా, భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా విపక్షాలపై కేసులు బనాయించి వేధించారనే ఆరోపణలను సీఎం జగన్ సొంతం చేసుకున్నారు. దీంతో అధికారం పోతే తన అక్రమాలు బయటకు వస్తాయనే భయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్య పట్ల పలు అనుమానాలు
ఏం జరుగుతుందో..?
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అరాచకాలు అన్నీ ఇన్ని కాదు.. ఈ మాట ఏపీలో ఎవర్ని అడిగినా ఇట్టే చెబుతారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై పగ తీర్చుకునే స్థాయిలో వైసీపీ నాయకులు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మాస్కులు లేవని చెప్పినందుకు ఓ వైద్యుడిని ఎలా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు. ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు విపక్షాలపై ఏ విధంగా దాడులు చేశారో ఆంధ్రా ప్రజానీకం చూసింది. గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక దందా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూముల ధర లక్షల కోట్లు ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై తరువాత వచ్చే ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన జగన్‌ను వెంటాడుతుందనే ప్రచారం జరుగుతోంది.
అన్నీ కుట్రలే..!
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్‌తో పాటు పార్టీ నాయకులు గెలుపే లక్ష్యంగా ఎంతకైనా తెగిస్తున్నారు. ఓ వైపు ఓటర్లను ప్రలోభ పెడుతుంటే.. ప్రలోభాలకు లొంగని వాళ్లను బెదిరిస్తున్నారు. ఓటు వేయకపోతే నీ అంతు చూస్తామని కొందరు వైసీపీ లీడర్లు హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో విపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల కోడ్‌ను సైతం వైసీపీ నాయకులు ఉల్లంఘిస్తున్నారట. మీరేం చేస్తారో నాకు తెలియదు.. మీరు గెలిచి రావల్సిందేనని సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులకు అల్టిమేటం జారీచేశారంట. దీంతో క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని మెజార్టీ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత తన భవిష్యత్తు ఏమిటనే భయం జగన్‌ను వెంటాడుతుందనే చర్చ నడుస్తోంది. ఫైనల్‌గా ఏం జరుగుతుందో జూన్-04 తర్వాత తెలియనుంది.
Kotam Reddy: ఎంపీ విజయసాయి, ఎమ్మెల్యే ప్రసన్నపై కోటంరెడ్డి హాట్ కామెంట్స్..
AP News: మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 24 , 2024 | 03:02 PM