AP Election Results: ఎన్నికల ఫలితాలపై సజ్జల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ABN, Publish Date - May 28 , 2024 | 04:07 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సరిగ్గా ఆరు రోజుల్లో రాబోతున్నాయి. దీంతో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇన్నాళ్లు వైనాట్ 175 అన్న వైసీపీ.. గెలిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక కూటమిలో అయితే.. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసిన వైసీపీ..
అమరావతి, ఆంధ్రజ్యోతి మే-28: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు (AP Election Results) సరిగ్గా ఆరు రోజుల్లో రాబోతున్నాయి. దీంతో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇన్నాళ్లు వైనాట్ 175 అన్న వైసీపీ.. గెలిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక కూటమిలో అయితే.. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసిన వైసీపీ.. అత్యుత్సాహంతో వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేయడం గమనార్హం. దీంతో.. ఆలూ లేదు.. చూలు లేదనే సామెతను జనాలు, ప్రతిపక్షాలు గుర్తు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లోనే మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మాటలకు అర్థమేంటి..?
ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు వైసీపీ నేతలు వెళ్లడం లేదన్నారు. బెట్టింగ్‌లు, సోషల్ మీడియాలో ప్రచారం కోసం తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. ‘నార్త్‌లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్‌లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చు. ఉద్యోగులంతా వైసీపీ వెనుకే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్‌కు లేనిపోని నిబంధనలు అడుగుతున్నారు. సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత బాబుకు అనుకూలంగా ఈసీ వ్యవహరించింది. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు. ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదు..?. మిగతా చోట్ల ఈవీఎంల ధ్వంసంకు సంబంధించిన వీడియోలను ఎందుకు బయటపెట్టలేదు..?’ అని సజ్జల డిమాండ్ చేశారు.
టార్గెట్ సీఎస్!
‘ ఏపీ ఎన్నికల పోలింగ్‌లో అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగాము.. బాధితులకు పార్టీ తరపున అండగా నిలుస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదుకుంటాం. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లున్నారు. సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలనే టార్గెట్‌తో రెండు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగ్రవాది లాగా సీఎస్‌పై దాడి చేస్తున్నారు. భయపెట్టి కాళ్ళ బేరానికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పదిరోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా...?. కారణాలు లేకుండా సీఎస్‌ను తప్పించాలని ఫిర్యాదు చేస్తున్నారు. వారం తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడ అవుతుంది’ అని సజ్జల జోస్యం చెప్పారు. అదిగో గెలిచేస్తున్నాం.. ఇదిగో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఇక ప్రమాణ స్వీకారమే ఆలస్యమని తెగ హడావుడి చేసిన వైసీపీ సడన్‌గా ఏమైందో కానీ చలీచప్పుడు లేదు. పోనీ.. నేతల నుంచి అయినా పాజిటివ్‌గా మాటలు వస్తాయనుకుంటే.. సజ్జల ఏం మాట్లాడారో అర్థమైంది కదా..? ఇక ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై కనీసం పొల్తెత్తి మాట కూడా మాట్లాడలేదు. సీన్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా..!
For More Andhra Pradesh News and Telugu News..
YSRCP: వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!
Updated Date - May 28 , 2024 | 04:16 PM