ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: పారిపోయినా పట్టుకొస్తా.. ప్రజాకోర్టులో శిక్షిస్తా..: చంద్రబాబు

ABN, Publish Date - Apr 23 , 2024 | 09:07 PM

అమదాలవలస(Amadalavalasa) ప్రజాగళం సభలో చంద్రబాబు(Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. జగన్‌పై(Jagan), తమ్మినేని సీతారాంపై(Tammineni Sitaram) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. డమ్మీ బస్సు నేత పని అయిపోయిందన్నారు.

Chandrababu

శ్రీకాకుళం, ఏప్రిల్ 23: అమదాలవలస(Amadalavalasa) ప్రజాగళం సభలో చంద్రబాబు(Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. జగన్‌పై(Jagan), తమ్మినేని సీతారాంపై(Tammineni Sitaram) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. డమ్మీ బస్సు నేత పని అయిపోయిందన్నారు. ఒరిస్సా పారిపోతాడని, అయినా పట్టుకు వస్తానని అన్నారు. పాపాలు పండాయని.. ప్రజాకోర్టులో శిక్షిస్తానని అన్నారు. అసమర్ధు స్పీకర్‌గా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేశాడని.. ముఖ్యమంత్రి ఒక సైకో.. ఇతను కూడా ఒక సైకోగా తయారై అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్టపాలు చేశారని విమర్శించారు.


స్పీకర్‌గా అర్హుడా?

తమ్మినేని సీతారాంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. స్పీకర్‌గా అర్హుడా? అని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిరాని దద్దమని ఎప్పుడూ చూడలేదన్నారు. పూర్తిగా అవినీతిపరుడు, ఆముదాలవలసని పూర్తిగా ఊడ్చేసాడని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్న ఆ ఇంట్లో వారికి బంగారు కానుకలు సమర్పించాల్సిందేనని చంద్రబాబు ఆరోపించారు. నాగవలి వంశధార ఇసుక విశాఖపట్నంకు వెళ్తోందని.. చెప్పేవి నీతులు చేసేవి బూతు పనులు అని దుయ్యబట్టారు. ఇంతటి దుర్మార్గమైన వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు. తన దృష్టిలో పడ్డవారిని తానంత ఈజీగా వదిలిపెట్టబోనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

ఇదికూడా చదవండి: వైసీపీ ప్రభుత్వం ఆ పథకం పేరు కూడా మార్చింది.. జనసేనాని ఫైర్


నేను వస్తే రైతే రాజు..

రూ. 13 లక్షల కోట్లు అప్పు చేసిన దొంగ జగన్ అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ను డెవలప్‌మెంట్ చేసి హైదరాబాద్‌కు ఆదాయం వచ్చేలా చేసింది తానేనని చంద్రబాబు చెప్పారు. ఆడపిల్లలకు భద్రత కల్పిస్తానని తనతో కలిసి నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రాష్ట్రం, అప్పులు ఉండే రైతులు ఏపీనే అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే పంటకు గిట్టుబాటు దర కల్పిస్తామని.. పంట బీమా కల్పిస్తామని అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తానని చెప్పారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకువస్తానని అన్నారు.

For More Andhra Pradesh News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 09:11 PM

Advertising
Advertising