ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఆ ఘటనలపై ఏపీ డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు.. వెంటనే రంగంలోకి పోలీసులు

ABN, Publish Date - May 14 , 2024 | 09:33 PM

మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు. మంగళవారం డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

Nara Chandrababu Naidu

అమరావతి: మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు. మంగళవారం డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైసీపీ వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ అనంతరం ప్రణాళికా బద్ధంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.


AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..

మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని చంద్రబాబు కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలి, దాడులకు పాల్పడతున్న వారిని అరెస్టు చేయాలని కోరారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి...లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. తాడిపత్రిలో రాళ్ల దాడులు జరిగాయని వాటిని కూడా అడ్డుకోవాలని తెలిపారు.


మాచర్లకు అదనపు పోలీస్ బలగాలు

ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో చంద్రబాబు మాట్లాడి పరిస్థితిని వివరించిన అనంతరం డీజీపీ చర్యలు తీసుకున్నారు. అదనపు పోలీసు బలగాలను పంపుతున్నట్లు డీజీపీ చెప్పారు. మరికాసేపట్లోనే బలగాలు అక్కడకు చేరుకుంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. మాచర్లలో హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Mukesh Kumar Meena: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 09:59 PM

Advertising
Advertising