మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీ వెనుకంజకు కారణం అదేనా..?

ABN, Publish Date - Apr 17 , 2024 | 05:19 PM

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వైనాట్ 175 నినాదాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్.. కనీసం 50 సీట్లలో గెలిచి పరువు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమివైపు ప్రజలు మొగ్గు చూపు తున్నట్లు తెలుస్తోంది.

AP Elections: వైసీపీ వెనుకంజకు కారణం అదేనా..?
YSRCP

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వైనాట్ 175 నినాదాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్ (YS Jagan).. కనీసం 50 సీట్లలో గెలిచి పరువు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలు తమకు ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ (YSRCP) ఆశించింది. కానీ అనూహ్యంగా సంక్షేమ పథకాల కంటే ప్రజలు గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడాన్ని ప్రధాన సమస్యగా చూస్తున్నారు.


రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంతో వైసీపీ ప్రభుత్వం విఫలమైందనేది ప్రజాభిప్రాయంగా ఉంది. దీంతో సంక్షేమ పథకాలు తమకు ఓట్లు తెచ్చిపెట్టవని జగన్‌ ప్రభుత్వానికి అర్థమైందనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలనే అందిస్తామని, అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తామని చెప్తోంది. దీంతో ఎవరున్నా సంక్షేమ పథకాలు వస్తాయనే ఆలోచనలో ఏపీ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అనేక సంస్థలు సేకరించిన ప్రజాభిప్రాయంలోనూ ఇదే విషయం వెల్లడైంది. తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అనేకమంది రాజకీయ పండితులు అంచనావేయడంతో పాటు.. ప్రజలు సైతం చంద్రబాబు సమర్థ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే విషయం అనేక సర్వేల్లో వెల్లడైంది. దీంతో కూటమి గెలుపునకు డోకా లేదనేది స్పష్టమవుతోంది.

AP Elections: మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా: షర్మిల


తెలంగాణలో సంక్షేమ పథకాలు ఇచ్చినా..

తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను అక్కడి ప్రజలు ఓడించారు. కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. దళితబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి.. అన్ని కులాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఓవైపు అభివృద్ధి మంత్రం జపిస్తూనే.. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజలు సైతం బీఆర్‌ఎస్ అమలుచేస్తున్న పథకాలపై అసంతృప్తితో లేకపోయినా.. అర్హులందరికీ పథకాలు ఇవ్వడం లేదని, కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయడంలేదనే విషయంలో ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకతతో ఉన్నారు. మరోవైపు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం ప్రజలకు నచ్చలేదు. దీంతో కేసీఆర్ సంక్షేమ పథకాలను ఎంతగా ప్రజల్లోకి తీసుకెళ్లినా.. ఆయన ఓటమిని అవ్వన్నీ ఆపలేకపోయాయి. మరోవైపు ఏపీలో సైతం జగన్ ఏకపక్షధోరణితో వ్యవహరిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులపై కక్షగట్టి.. ప్రతీకారం తీర్చుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో ఏపీ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రజాస్వామ్యంలో నాయకుడిని ఎన్నుకోవల్సింది ప్రజలే.. అటువంటి ఓటర్లను వేధింపులకు గురిచేస్తే.. తప్పకుండా ఎన్నికల్లో ఆ ఫలితాలను చూడాల్సి వస్తుంది. ఇటువంటి అనుభవాలు గతంలో ఎన్నో ఎన్నికల్లో చూశాం. సీఎం వైఎస్ జగన్ సైతం తాను గొప్పవాడినని, తనను చూసే రాష్ట్రప్రజలు ఓట్లు వేస్తారనే ఆలోచనలో ఉన్నారనేది ఆయన వైఖరి తెలియజేస్తోంది. ప్రజలు మాత్రం జగన్ ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతోంది. జగన్ వైఖరి మారాలన్నా.. అహంకారం తగ్గాలన్నా.. ఈసారి అధికారాన్ని అప్పగించకూడదనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.


అతి విశ్వాసమే దెబ్బతీస్తుందా..

వైసీపీ నాయకుల అతి విశ్వాసమే ఈ ఎన్నికల పోటీలో ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉండటానికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 175 సీట్లలో గెలుస్తామని చెప్పడం, తనను చూసి ఓట్లు వేస్తారనే ఆలోచనే జగన్‌ వెనుకంజకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా తన తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుంటారో.. లేదా అతి విశ్వాసానికి పోయి.. ఘోరపరాభావాన్ని ఎదురు చూస్తారా అనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.


YCP: ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 05:26 PM

Advertising
Advertising