AP Elections: పల్నాడు ఘటనలపై ఈసీ సీరియస్
ABN, Publish Date - May 13 , 2024 | 07:55 AM
Andhrapradesh: పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
అమరావతి, మే 13: పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయ్యింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ (EC) ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ (TDP) ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పలనాడు ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వ్ ర్ రామ్మోహన్ మిశ్రా బయల్దేరి వెళ్లారు.
AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..
అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ తరుపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. తీవ్ర గాయపడ్డ సుబ్బయ్యను వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అలాగే అటు మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెంటచింతలలో టీడీపీ ఏజెంట్ల దాడికి పాల్పడ్డారు. నలుగురు టీడీపీ ఏజెంట్లకు తలలు పగిలాయి. ఏజెంట్లుగా టీడీపీ వాళ్లకు ఉండటానికి వీలేద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
Loksabha polls: నిజామాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..
Read Latest AP News And Telugu News
Updated Date - May 13 , 2024 | 08:14 AM