ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Jagan: ఐదేళ్లలో జగన్‌ ‘ఇష్టారాజ్యం’.. 60 నెలల్లో కేవలం...!

ABN, Publish Date - May 21 , 2024 | 03:35 AM

తాను అధికార దర్పాన్ని అనుభవించడానికి, ప్రతిపక్ష నేతలపై పగ సాధించడానికే జగన్మోహన్‌రెడ్డికి పదవి దక్కినట్లయింది!

  • అనుభవించు రాజా..!

  • 60 నెలల్లో కేవలం 50 కేబినెట్‌ భేటీలు

  • అప్పుడు మాత్రమే సచివాలయ సందర్శన

  • తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే పాలనంతా

  • చంద్రబాబు హయాంలో 108 భేటీలు

  • విధిగా సచివాలయం డ్యూటీ

  • రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ సచివాలయం! ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు విధిగా సచివాలయానికి రావాలి. కానీ... జగన్‌ పాలనలో ‘సచివాలయం’ అలంకార ప్రాయంగా మారింది.

  • 60 నెలల పాలనలో జగన్‌ కేవలం 50 కేబినెట్‌ సమావేశాలు నిర్వహించారు. అందులో అత్యధికం అస్మదీయులకు భూముల కేటాయింపు వంటి ‘సొంత’ అజెండాతోనే!

  • కేబినెట్‌ సమావేశాలున్నప్పుడు మాత్రమే... అదీ తప్పనిసరి కావడంతో జగన్‌ సచివాలయానికి వెళ్లారు.

  • చంద్రబాబు ఐదేళ్లలో 108 కేబినెట్‌ భేటీలు నిర్వహించారు. జిల్లా పర్యటనలు, ఇతర ముఖ్యమైన అధికార విధులు ఉంటే మినహా... ప్రతి రోజూ ఆయన సచివాలయానికి హాజరయ్యేవారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తాను అధికార దర్పాన్ని అనుభవించడానికి, ప్రతిపక్ష నేతలపై పగ సాధించడానికే జగన్మోహన్‌రెడ్డికి (YS Jagan Mohan Reddy) పదవి దక్కినట్లయింది! ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పాలన ఎలా చేయకూడదో చెప్పడానికి జగన్‌ సర్కారే ఒక ఉదాహరణ. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజలను దూరంగా ఉంచారు. తాను ‘ప్యాలెస్‌’ వీడి బయటికి అడుగు పెట్టినప్పుడూ... పరదాలు, బారికేడ్లతో ప్రజలను ఆమడ దూరం ఉంచారు.

సచివాలయానికి దూరం

సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లో నుంచే పాలన చేసిన ఏకైక సీఎం జగన్‌. ఈ ఐదేళ్ల వ్యవధిలో జగన్‌ 50 సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చారు. అది కూడా మంత్రివర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే! ఇంట్లో కేబినెట్‌ భేటీలు నిర్వహించరాదనే నిబంధన ఉండటంతో.. ఇష్టంలేకున్నా, కష్టంమీదే ఆయన సచివాలయానికి వెళ్లాల్సి వచ్చింది. లేకుంటే అటువైపు చూసేవారు కాదేమో! 2019 మేలో అధికారం చేపట్టాక మొదటి పక్షం రోజులు మాత్రమే ఆయన సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత అటువైపు చూడటం మానేశారు. ప్రభుత్వ సొమ్ముతో తాడేపల్లి ప్యాలెస్‌లో భారీ నిర్మాణాలు, సకల ఏర్పా ట్లు చేసుకున్నారు. డిసెంబరులో మూడు రాజధానుల పాట అందుకున్నాక సచివాలయానికి పూర్తిగా దూరమయ్యారు. మంత్రులు కూడా సచివాలయానికి వెళ్లడం మానేశారు. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శు లు, విభాగాధిపతులు కొందరు సచివాలయానికి వెళ్లకుండా సొంతంగా ఇంట్లోనే క్యాంపు ఆఫీసులు పెట్టుకున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రమే జగన్‌ సచివాలయానికి వెళ్లారు. ఈ ఐదేళ్లలో 50 సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చారు. అంటే.. 60 నెలల పాలనలో జగన్‌ మంత్రివర్గ భేటీలు నిర్వహించింది 50 సార్లు మాత్రమే.


రాచరిక పాలనలా...

ఐదేళ్ల కాలంలో జగన్‌ అధికార దర్పాన్ని, రాచరిక, నియంత పోకడలను ప్రదర్శించారు. అవసరం లేకున్నా సలహాదారులు, వారికి సలహాదారులు, చివరకు అధికారులకు సలహాదారులను నియమించడం జగన్‌ పాలనలోనే జరిగింది. పండగలు, ఉత్సవాలు ప్రజల మధ్య జరుపుకోవడం పాలకుల ఆనవాయితీ. ఇలాంటివి జగన్‌కు నచ్చవు. చివరకు దేవుడు కూడా తన దగ్గరకే రావాలన్నట్టుగా జగన్‌ వ్యవహరించారు. ఇక అవినీతి గురించి రోజుల కొద్దీ కథలు కథలుగా చెప్పొచ్చు. ఇసుక, కొండలు, గుట్టలు, గనులు.. ప్రకృతి వనరులను దేన్నీ వదలకుండా దోచేశారు. మద్యంలో వేల కోట్లు కొల్లగొట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్‌లా ‘అధికారాన్ని’ అనుభవించి ఉండరేమో!

ఇదీ చంద్రబాబు మార్క్‌

2014-19లో నవ్యాంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో 108 సార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. నెలకు సగటున ఒక సమావేశం విధిగా జరిపేవారు. కీలకమైన అంశాలు ఉన్నప్పుడు నెలకు రెండు మూడుసార్లు మంత్రివర్గ భేటీలు జరిగిన సందర్భాలున్నాయి. జిల్లాల్లో పర్యటించినపుడు లేదా ఢిల్లీ, విదేశీ పర్యటనలు ఉంటే తప్ప చంద్రబాబు విధిగా సచివాలయానికి వచ్చేవారు. వారంలో ఐదు రోజులు కచ్చితంగా సచివాలయంలో ఉండేవారు. సచివాలయం అంటే పాలనా కేంద్రం కావున అక్కడికి సీఎంతో పాటు మంత్రులు, అధికారులు, సిబ్బంది సమయానుగుణంగా వచ్చేలా చంద్రబాబు పాలన సాగింది. మంత్రుల హాజరు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. 2014 జూలైలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. ఆ ఒక్క నెలలోనే 13 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరిపారు. 2015లో 24, 2016లో 22, 2017లో 18 సార్లు కేబినెట్‌ భేటీలు నిర్వహించారు. 2019లో ఎన్నికల కోడ్‌ రావడానికి ముందు కూడా అరడజను సార్లు సమావేశాలు నిర్వహించిన చరిత్ర చంద్రబాబుది. ఇక జిల్లాలకు వెళ్లినప్పుడు అవసరాన్ని బట్టి చంద్రబాబు అక్కడే బస చేసేవారు. ఒకేసారి రెండు మూడు రోజులు జిల్లాల పర్యటన చేసేవారు.

Updated Date - May 21 , 2024 | 11:23 AM

Advertising
Advertising