AP Elections: ఇండిపెండెంట్‌లకు గ్లాసు గుర్తు కేటాయించడంపై సీఈసీకి మాజీ ఎంపీ ఫిర్యాదు
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:28 PM
Andhrapradesh: జనసేన గ్లాసు గుర్తును ఇండిపెండెంట్‌లకు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే మే నెలలో పెన్షన్‌కు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపైనా సీఈసీకి మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుందని తెలిపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: జనసేన గ్లాసు గుర్తును ఇండిపెండెంట్‌లకు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర (TDP Former MP Kanakamedala Ravindra kumar) కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే మే నెలలో పెన్షన్‌కు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపైనా సీఈసీకి మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుందని తెలిపారు. జనసేన పోటీ చేస్తున్న చోట స్వాతంత్ర అభ్యర్థులకు కూడా గ్లాస్ గుర్తును కేటాయించారని చెప్పారు. వైసీపీ నేతలు కావాలనే కొన్ని చోట్ల ఇండిపెండెంట్‌లతో పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు.
AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!
జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కొంతమందితో నామినేషన్ వేయించారన్నారు. కొన్ని చోట్ల గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్స్‌కు కేటాయించేలా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యవహరించారన్నారు. కొందరు రిటర్నింగ్ అధికారులు వైసీపీకి అనుకూలంగా మారారని విమర్శించారు. ఓటర్లలో వైసీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని.. దాని ద్వారా లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో గ్లాస్ గుర్తును వేరే వారికి కూడా కేటాయించారన్నారు. జనసేన పోటీ చేయని చోట టీడీపీకి నష్టం చేసే విధంగా గ్లాస్ గుర్తుకు ఓటు వేసే విధంగా సింబల్ కేటాయించేలా వైసీపీ వ్యవహరించిందని వెల్లడించారు.
Manifesto 2024: ఊహించని రీతిలో పెన్షన్ల పెంపు.. మేనిఫెస్టోలో కూటమి ప్రకటన
పెన్షనర్లకు డబ్బులు ఇంటి వద్ద ఇవ్వకుండా వారిని తిప్పుతున్నారన్నారు. ఎన్నికల సంఘం గతంలో ఇంటి వద్దకే పెన్షన్లు పంపించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. మేలో ఇచ్చే పెన్షన్ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పెన్షన్ దారులను ఇబ్బందికి గురి చేసే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పెన్షనర్లను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని జగన్ చూస్తున్నారన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి అందరూ వైసీపీ గెలవాలని కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. కొందరు అధికారులు వైసీపీకి సపోర్ట్‌గా భక్తి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈసీపై జగన్ ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ఎలక్షన్ కమిషన్‌ను పక్కదారి పట్టిస్తున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ICC T20 World Cup India's Team: టీ20 వరల్డ్ కప్ ఇండియా టీమ్ ఇదే..
Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు
Read Latest AP News And Telugu News
10th ఫలితాల కోసం క్లిక్ చేయండి...
Updated Date - Apr 30 , 2024 | 04:46 PM